వైసిపి కోసం పృథ్వీ కొత్త గ్యాంగ్

Published : Mar 19, 2019, 03:26 PM IST
వైసిపి కోసం పృథ్వీ కొత్త గ్యాంగ్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నటుడు పృథ్వీ చురుగ్గా పాల్గొంటున్నారు. సినిమా షూటింగ్ లను కొన్ని రోజుల వరకు పక్కనపెట్టి కళాకారులను కలుపుకొని ఏపి రాజకీయాల్లో వైసిపి పార్టీ కోసం ప్రచారాలను చేయడానికి సిద్ధమవుతున్నారు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నటుడు పృథ్వీ చురుగ్గా పాల్గొంటున్నారు. సినిమా షూటింగ్ లను కొన్ని రోజుల వరకు పక్కనపెట్టి కళాకారులను కలుపుకొని ఏపి రాజకీయాల్లో వైసిపి పార్టీ కోసం ప్రచారాలను చేయడానికి సిద్ధమవుతున్నారు. పృథ్వీ రాకతో వైసిపి పార్టీకి కాస్త సినీ ఫీల్డ్ తో సంబంధాలు బాగానే ఏర్పడ్డాయని కథనాలు బాగానే వస్తున్నాయి. 

అంతేకాకుండా పృథ్వీ తనవరకు సినీ కళాకారులను వైసిపి సైడ్ వచ్చేలా బాగానే కష్టపడుతున్నాడు. వీలైనంత వరకు జూనియర్ ఆర్టిస్ట్ లను రప్పిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఏ మాత్రం రెస్ట్ లేకుండా పృథ్వీ తన టాలెంట్ చుపించాడనికి రాష్ట్రమంతా తిరగనున్నాడు. అధికార పార్టీ వైసీపీ పార్టీని దెబ్బ కొట్టడానికి ఓటర్లను ఏమరుస్తున్నారు అని పార్టీకి సంబందించిన కళాకారుల బృందంతో రాష్ట్రమంతా పర్యటన చేయడానికి సిద్దమవుతున్నట్లు చెప్పారు. 

పృథ్వీ నాయకత్వంలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మొదలుకొని అన్ని జిల్లాల్లో పర్యటిస్తారట. పాటలతో అలాగే నాటకాలతో జనాలను ఉత్తేజపరచాలని గట్టిగా ప్లాన్ వేసుకున్నారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలను మోసాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని వైసిపి కళాకారులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు చెమటలు పట్టించిన కాశీ- జ్యో ఆ ఇంటి బిడ్డ కాదన్న శ్రీధర్
Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌