'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల ఆపలేం.. తేల్చేసిన హైకోర్టు!

Published : Mar 19, 2019, 03:15 PM ISTUpdated : Mar 19, 2019, 03:39 PM IST
'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల ఆపలేం.. తేల్చేసిన హైకోర్టు!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలను ఆపాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలను ఆపాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసి సినిమా విడుదలను ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆపాలని కోరారు కొందరు టీడీపీ కార్యకర్తలు.

కానీ ఎలెక్షన్ కమిషన్ సినిమా విడుదల ఆపడం కుదరదని తేల్చి చెప్పింది. ఇప్పుడు హైకోర్టులో కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి ఊరట లభించింది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'లక్ష్మీస్ వీరగ్రంధం' సినిమాల విడుదలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాన్ని పరిశీలించిన కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. 

ప్రతి వ్యక్తికి భావ ప్రకటనా స్వేచ్చ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. సినిమా విడుదలను ఆపాల్సిన అవసరం లేదని వెల్లడించింది. బుధవారం నాడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా సెన్సార్ జరగనుంది. అది పూర్తయిన తరువాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారిని సరి చేసి మార్చి 29న సినిమాను విడుదల చేయడానికి  సిద్ధమవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌
9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?