
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నాడు. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ప్రస్తుతం చిరు చేతిలో నాలుగు సినిమాలున్నాయి. రీసెంట్ గా ఆచార్యతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు చిరంజీవి. కాని ఈ సినిమా ఆడియన్స్ తో పాటు.. అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో మెగాస్టార్ నెక్ట్స్ మూవీస్ పై గట్టిగా దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం చిరు రెండు సినిమా షూటింగ్‌లను ఒకేసారి షూటింగ్ చేస్తున్నాడు. అందులో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో విలప్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదిస్తున్నారట.
విజయ్ సేతుపతి లాంటి యాక్టర్స్ చాలా రేర్ గా ఉంటారు. అందరిలా ఆయన కమర్షియల్ సినిమాలు పట్టుకుని వేళ్ళాడడు. అలా అని అసలు కమర్షియల్ సినిమాలు చేయడా అంటే అది కాదు. కాని తనకు నచ్చిన పాత్ర తగిలినప్పుడు ఆలోచించకుండా ఒప్పేసకుంటాడు. అది హీరో అయినా... విలన్ అయినా.. ఇంకేదైనా... చివరకి హిజ్రా క్యారెక్టర్ అయినా సరే చేయడానికి ఆలోచించడు విజయ్ సేతుపతి
ఒక వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపును సంపాదించికున్నాడు విజయ్ సేతుపతి. పాత్ర నచ్చితే చిన్న సినిమాల్లో కూడా నటించడానికి సిద్దంగా ఉండే అతికొద్ది మంది నటులలో ఈయన ఒకడు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు విజయ్. ఉప్పెనలో విజయ్ విలనిజంకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ధళపతి విజయ్ మాస్టర్ సినిమాలో కూడా విజయ్ విలనిజంకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలో విజయ్ సేతుపతి ముచ్చటగా మూడో సారి విలన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న వాల్తేరు వీరయ్యలో విలన్‌గా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించనున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇది వరకే మేకర్స్ విజయ్ సేతుపతిని సంప్రదించగా, పాత్ర నచ్చడంతో తన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఈ మూవీలో విజయ్ సేతుపతి పాత్ర ఇంటర్వెల్‌లో రివీల్అవుతుందని సమాచారం. ఈ విషయంలో మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రాబోతున్నట్టు సమాచారం. ఇక ఈసినిమాలో చిరు అండర్‌కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. మాస్‌రాజ రవితేజ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.