ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో చేసుకోవాలి, సూపర్ స్టార్ కృష్ణకు ఏపి సీఎం జగన్ స్పెషల్ విషెష్

Published : May 31, 2022, 05:14 PM ISTUpdated : May 31, 2022, 05:25 PM IST
ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో చేసుకోవాలి, సూపర్ స్టార్ కృష్ణకు ఏపి సీఎం జగన్ స్పెషల్ విషెష్

సారాంశం

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణకు అన్ని రంగాల నుంచి పుట్టిరోజు శుభాకంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కృష్ణకు  బర్త్ డే విషెష్ తెలియజేశారు. 

తొలి తెలుగు జేమ్స్‌బాండ్‌, కౌబాయ్‌ సూపర్ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా.. నేడు మంగళవారం(మే 31) ఆయన 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖుల నుంచి కృష్ణకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందుతున్నాయి. ముఖ్యంగా ఆయన తనయుడు, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కోడలు ప్రత్యేకంగా విషెస్‌ తెలిపారు. అలాగే సీని ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకనేడు ఆయన బర్త్‌డే నేపథ్యంలో కృష్ణకు అరుదైన గౌరవంకూడా దక్కింది. సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్  వరించింది.

ఇది ఇలా ఉండగా.. సూపర్ స్టార్ కృష్ణకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బర్త్ డే విషెష్క తెలుపుతూ.. ట్వీట్ చేశారు జగన్. ఆయన ఏమన్నారంటే.. సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన   శుభాకాంక్షలు.. అభిమానుల    ప్రేమానురాగాలు, ఆ దేవుని దీవెనలతో ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి  అని మనస్పూర్తిగా కోరకుంటున్నాను అంటూ జగన్ ట్వీట్ చేశారు. 

 

సూపర్‌ స్టార్‌ కృష్ణ చిన్న చిన్న పాత్రలు పోషించిన 1965లో వచ్చిన తేనె మనసులు సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. తర్వాత వచ్చిన మూడో సినిమా గూఢచారి 116 సినిమాతోనే స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా.. అనేక బ్లాక్‌బ్లస్టర్‌ హిట్‌లు ఇచ్చిన కృష్ణ.. డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తెలుగు సినిమాను  సరికొత్త పుంతలు తొక్కేలా చేశారు. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 23: విశ్వ‌క్‌కు షాకిచ్చిన అమూల్య.. మరొక ప్లాన్‌తో పెళ్లి చెడగొట్టేందుకు రెడీ
Gunde Ninda Gudi Gantalu: వామ్మో రోహిణీ మామూలు ఆడది కాదు, నిమిషంలో ప్లేట్ తిప్పేసింది, మరోసారి బకరా అయిన మనోజ్