రెండు పడవల ప్రయాణం పవన్ కి ఎలా ఉందో తెలియదు కానీ ఆయన చుట్టూ ఉన్నవారికి చుక్కలు చూపిస్తుంది. నమ్మిన నిర్మాతలకు, నటులకు హార్ట్ బీట్ పెంచేస్తుంది. తాజాగా ఈ లిస్ట్ లో హీరో ధరమ్ తేజ్ కూడా చేరారు.
ఏపీలో ఎన్నికలకు కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. గత ఎన్నికల్లో ఎదురైన పరాభవం నేపథ్యంలో ఈసారి కనీసం పరువు నిలబెట్టుకోవాలని జనసేన ఆశిస్తుంది. ఈ క్రమంలో పవన్ ఎక్కువగా జనాల్లో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమాత్రం షూటింగ్ కి గ్యాప్ వచ్చినా పవన్ ఏపీలో పర్యటనలు చేస్తున్నారు. ప్రెస్ మీట్స్ పెట్టి అధికార వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అవసరమైతే షూటింగ్ షెడ్యూల్స్ పక్కన పెట్టి పొలిటికల్ క్యాంపైన్స్ చేస్తున్నారు.
ఈక్రమంలో ఆయన ఒప్పుకున్న చిత్రాల షూటింగ్స్ ఆలస్యం అవుతున్నాయి. పవన్ (Pawan Kalyan) అజెండా కారణంగా హరిహర వీరమల్లు బాగా ఎఫెక్ట్ అవుతుంది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఆలస్యం అయ్యే కొలది నిర్మాతపై పెను భారం పడుతుంది. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ రెండేళ్లుగా పవన్ మూవీ కోసమే మడిగట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఆయన పచ్చ జండా ఊపితే అప్పుడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి.. సినిమా కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నారు. అయితే హరీష్ కల నెరవేరడం కష్టమే అనిపిస్తుంది.
undefined
హరీష్ శంకర్ మూవీ కంటే ముందు తమిళ రీమేక్ వినోదాయ సిత్తం (Vinodhaya Sitham) పూర్తి చేయాలని పవన్ డిసైడ్ అయ్యాడు. ఈ రీమేక్ ఆగిపోయిందని భావించగా... సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు సముద్ర ఖని లేదని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని తెలియజేశాడు. ఈ మూవీలో పవన్ పాత్ర తక్కువ నిడివి కలిగి ఉంటుంది. కేవలం 20-30 వర్కింగ్ డేస్ లో పవన్ పార్ట్ పూర్తి చేయొచ్చు. ఈ కండీషన్ పై పవన్ ఈ రీమేక్ కి ఒప్పుకున్నారు.
కాగా ఈ మూవీలో ప్రధాన పాత్ర సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)చేస్తున్నారు. ప్రమాదం నుండి కోలుకున్న సాయి ధరమ్ వినోదయ సిత్తం మూవీతో రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కూడా ఆలస్యం అవుతుంది. జులై నుండి వినోదయ సిత్తం రెగ్యులర్ షూటింగ్ జరగాల్సి ఉండగా... అది కాస్తా సెప్టెంబర్ కి షిఫ్ట్ అయినట్లు సమాచారం. పవన్ బిజీగా ఉన్న కారణంగా షూటింగ్ మరో రెండు నెలలకు వాయిదా వేశారట. దాదాపు 9 నెలలుగా ఇంటికే పరిమితమైన ధరమ్, పవన్ వస్తే షూటింగ్ కి వెళ్దాం అనుకుంటే, అది కాస్తా వెనక్కిపోతుందట.
హరి హర వీరమల్లు షూటింగ్ 50 శాతం కూడా పూర్తి కాలేదు. వినోదాయ సిత్తం సెట్స్ పైకి వెళ్ళలేదు. హరీష్ మూవీ మరింత ఆలస్యం కానుంది. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డితో ప్రకటించిన మూవీ రద్దయినట్లే అన్నమాట వినిపిస్తుంది. ఏమైనా పవన్ పాలిటిక్స్ ఆయనతో కమిటైన దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాయి.