సైరా నరసింహారెడ్డిలో విలన్ గా విజయ్ సేతుపతి..తమిళనాట సైరా బజ్

Published : Aug 24, 2017, 07:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
సైరా నరసింహారెడ్డిలో విలన్ గా విజయ్ సేతుపతి..తమిళనాట సైరా  బజ్

సారాంశం

మెగాస్టార్ 151లో తమిళ స్టార్ విజయ్ సేతుపతి చిరంజీవి సినిమా అనగానే కేరక్టర్ కు ఓకే చెప్పిన సేతుపతి సేతుపతి చేస్తుండటంతో తమిళనాట సైరా నరసింహారెడ్డికి క్రేజ్

విజయ్ సేతుపతి ఏ కేరక్టర్ చేసినా డిఫరెంట్ గా వుంటుంది. అతని కెరీర్ లో ఫెయిల్యుర్స్ వున్నా... విజయ్ ఎన్నుకునే పాత్రల్లో వైవిధ్యం ఉంటుందని కోలీవుడ్ లవర్స్ అభిప్రాయం. వైవిధ్యమైన పాత్రలు చేయడంలో తనకు తనే సాటి అనిపించుకున్న సేతుపతి ఇప్పటిదాకా ఏ హీరో సినిమాలోనూ సపోర్టింగ్ క్యారెక్టర్ చెయ్యలేదు. మొట్ట మొదటిసారిగా తెలుగులో వస్తున్న ఒక సినిమాలో  విలన్ పాత్ర చేయటానికి సిద్దమయ్యాడు విజయ్ సేతుపతి..

 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా..నరసింహారెడ్డి చిత్రంలో సేతుపతి విలన్ షేడ్స్ వుండే కేరక్టర్ లో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మెగాస్టార్ సినిమాలో నటించటానికి విజయ్ ఓకే అనగానే కోలీవుడ్ కూడా ఈ సినిమా వైపు ఆసక్తిగా చూస్తోంది.

 

చిరు సినిమా అనగానే.. క్యారక్టర్ ఏంటనేది అడగకుండానే మెగాస్టార్ చిరంజీవి పక్కనే నటించాలనే ఉద్దేశంతో.. అసలు క్యారక్టర్ ఏంటనేది అడగకుండానే ఓకే చేశాడట. ఈ సినిమాలో బ్రిటీష్ వారి దగ్గర సిపాయిగా పనిచేసే ఒక భారతీయుడు పాత్రలో నటిస్తున్నాడని టాక్. అయితే ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి బ్రిటిష్‌ అంగరక్షకుడిగా నెగెటివ్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తాడని వినిపిస్తోంది. . విజయ్ పోషిస్తున్న పాత్ర తొలుత ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రను అస్సలు ఇష్టపడదట. బ్రిటీష్ వారిపైకి దండయాత్రకు కాని చివరకు మాత్రం ఉయ్యాలవాడ తపనను అర్ధంచేసుకుని.. ఆయనతో చేతులు కలిపి.. బ్రిటీష్ వారిపైకి దండయాత్రకు సిద్దపడుతుందట. చివరకు ఉయ్యాలవాడతో కలసి ప్రాణాలు అర్పిస్తుందట. అంతటి ఎమోషన్ ఉన్న పాత్ర కాబట్టే అడగ్గానే విజయ్ సేతుపతి ఓకే అనేశాడు.

 

కథలో ఈ పాత్ర చాలా కీలకమని, ఈ పాత్రకి పేరున్న నటుడు అవసరమని, అయితే రెగ్యులర్‌ యాక్టర్స్‌ కాకుండా ఎవరైనా పాపులర్‌ యాక్టర్‌ అయితే బాగుంటుందని ఆలోచించి చివరకు విజయ్‌ సేతుపతిని ఫైనలైజ్‌ చేసారట. ఇతను ఈ చిత్రంలో నటిస్తున్నాడని తెలియడంతో ఒక్కసారిగా తమిళ మీడియా, జనం సైరాపై ఆసక్తి చూపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే
Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?