
నందమూరి బాలకృష్ణ సినిమాల కోసం ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. ప్రస్థుతం బాలయ్య కెయస్ రవికుమార్ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు బాలయ్య పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన పైసా వసూల్ సినిమా సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధంగా వుంది.
ఇక పూరీ వర్క్ స్టైల్ నచ్చిన బాలయ్య కెయస్ రవికుమార్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నాక మరోసారి పూరీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట. అన్నీ కుదిరితే మరోసారి పూరీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించనున్నారన్నమాట.
ఇక మరోవైపు బాలకృష్ణ కు బ్యాక్ టు బ్యాక్ హిట్లిచ్చి ఈ మధ్యే జయజానకినాయక చిత్రం విజయంతో మాంచి జోష్ మీదున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు. మొత్తానికి బాలయ్య తదుపరి రెండు సినిమాలు కూడా లైన్ లో పెట్టేశారన్నమాట.