హీరోగా విజయ్ సేతుపతి కొడుకు ఎంట్రీ.. దర్శకుడు ఎవరు? టైటిల్ కూడా ఫిక్స్..!

Published : Nov 25, 2023, 05:26 PM ISTUpdated : Nov 25, 2023, 05:34 PM IST
హీరోగా విజయ్ సేతుపతి కొడుకు ఎంట్రీ.. దర్శకుడు ఎవరు? టైటిల్ కూడా ఫిక్స్..!

సారాంశం

విజయ్ సేతుపతి కొడుకు హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యారు. అతని డెబ్యూ మూవీకి సంబంధించిన డిటేయిల్స్, టైటిల్ కూడా వచ్చేసింది. వివరాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 

మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇండియా మొత్తం నటుడిగా పాపులర్ అయ్యారు. ఇక ఆయన నటవారసత్వాన్ని తన కొడుకు సూర్య సేతుపతి (Surya Sethupathi) కొనసాగించబోతున్నారు. విజయ్ సేతుపతి కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఇందుకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తాజాగా డిటేయిల్స్ అందాయి. 

విజయ్ సేతుపతి తనయుడు సూర్య హీరోగా పరిచయం అవుతూ రూపుదిద్దుకోబోతున్న కొత్త చిత్రానికి ‘ఫీనిక్స్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రం తమిళంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతోనే సూర్య కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. సినిమాకు ప్రముఖ స్టంట్ డైరెక్టర్ అన్ల్ అరసు (Anal Arasu)   దర్శకత్వం వహిస్తున్నారు. ఇక స్టార్ కిడ్ సూర్య గతంలో తన తండ్రి నటించిన ‘నానుమ్ రౌడీ ధాన్’ (2015), ’సింధుబాద్’ (2019) సినిమాల్లో విజయ్ సేతుపతితో కలిసి నటించారు. 

ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఎలా ఓకే అయ్యిందనేది.. ఇంత త్వరగా సూర్యను హీరోను చేస్తుండటానికి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉందని తెలుస్తోంది. విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన అట్లీ - షారుఖ్ ఖాన్‌ కాంబోలోని జవాన్ సెట్స్‌కు ఓసరి తనయుడు సూర్య వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను చూసిన స్టంట్ డైరెక్టర్ అరసు సూర్యను ఎంపికచేసుకున్నట్టు మేకర్స్ తెలిపారు. మరోవైపు ఈ మూవీ యాక్షన్ జోనర్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇందు కోసం సూర్య ఆరెనెలలుగా ప్రత్యేక శిక్షణ తీసుకోవడం కూడా పూర్తైందని తెలిపారు. ఎకె బ్రేవ్‌మన్ పిక్చర్స్ బ్యానర్ పై రాజలక్ష్మి అరసకుమార్ నిర్మిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్
Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌