తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

అనుపమ రింగుల జుట్టుకు పడిపోయిన టిల్లుగాడు.. `టిల్లు స్వ్కైర్‌` నుంచి రాధిక సాంగ్‌ ప్రోమో

Aithagoni Raju | Published : Nov 25, 2023 4:55 PM

సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ కలిసి నటిస్తున్న `టిల్లు స్వ్కైర్‌` మూవీ నుంచి సెకండ్‌ సాంగ్‌ రాబోతుంది. తాజాగా సాంగ్‌  ప్రోమో విడుదలైంది. ఇంట్రెస్టింగ్‌గా సాగింది.

`డీజే టిల్లు` టాలీవుడ్ లో చిన్న చిత్రాల్లో ఒక సంచలనం. ఈ మూవీ భారీ హిట్‌ అందుకుంది. ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. దీంతో ఆ మూవీకి సీక్వెల్‌గా `టిల్లు స్వ్కైర్‌` మూవీ రూపొందుతుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా, ఇందులో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా చేస్తుంది. మలిక్‌ రామ్‌ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ మూవీ రూపొందుతుంది. 

ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. ఫిబ్రవరిలో రాబోతుంది. అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికే ఓ సాంగ్‌ని విడుదల చేయగా, అది దుమ్మురేపింది. ఇప్పుడు మరో సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు. `రాధిక` పేరుతో సాగే పాటని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా సాంగ్‌ ప్రోమోని విడుదల చేశారు. `రింగుల జుట్టు చూసి పడిపోయానే.. నీ బొంగుల మాటలిని పడిపోయానే` అంటూ అనుపమా పరమేశ్వరన్‌ని ఉద్దేశించి హీరో సిద్దు పాడే పాట ఇది. 

అనుపమా రింగులపై ఈ పాట సాగడం ఓ విశేషమైతే. ఇందులోనూ హీరోయిన్‌ పేరు రాధికగానే ఉండబోతుందని తెలుస్తుంది. మొదటి భాగంలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించగా, ఆమె పేరు రాధికా. ఆ పేరు పెద్ద బ్రాండ్‌గానూ మారిపోయింది. దాన్ని ఇందులోనూ కంటిన్యూ చేస్తున్నారని తెలుస్తుంది. తాజాగా పాట  ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ నెల 27న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. దీంతో సినిమాపై ఆసక్తి ఏర్పడుతుంది.
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!