BiggBoss7: పక్కాగా కప్ మనదే, బాధపడకు.. అమర్ దీప్ కి సపోర్ట్ గా అరియనా కామెంట్స్

Published : Nov 25, 2023, 05:18 PM IST
BiggBoss7: పక్కాగా కప్ మనదే, బాధపడకు.. అమర్ దీప్ కి సపోర్ట్ గా అరియనా కామెంట్స్

సారాంశం

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 నెమ్మదిగా గ్రాండ్ ఫినాలే దిశగా పయనిస్తోంది. హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య ఇంటెన్సిటీ, మాటల యుద్ధం పెరుగుతోంది.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 నెమ్మదిగా గ్రాండ్ ఫినాలే దిశగా పయనిస్తోంది. హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య ఇంటెన్సిటీ, మాటల యుద్ధం పెరుగుతోంది. ఈ సీజన్ లో కనీసం ఒక్కసారైనా కెప్టెన్సీ దక్కించుకోవాలని అమర్ దీప్ వీర ప్రయత్నాలే చేస్తున్నాడు. 

కానీ శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో అతడి కల చెదిరే నిర్ణయం బిగ్ బాస్ తీసుకున్నారు. బిగ్ బాస్ ఈవారం కెప్టెన్సీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో అమర్ దీప్ అసలు ఫలించలేదు. దీనితో అమర్ దీప్ తీవ్రంగా భవోద్వేగానికి గురయ్యాడు. బిగ్ బాస్ ఒక్క ఛాన్స్ బిగ్ బాస్ అంటూ వేడుకున్నాడు. మరి అమర్ దీప్ కెప్టెన్సీ ఛాన్స్ దక్కుతుందా లేదా బిగ్ బాస్ నిర్ణయమే ఫైనలా అనేది రానున్న ఎపిసోడ్స్ లో చూడాలి. 

అయితే అమర్ దీప్ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అమర్ దీప్ కెప్టెన్సీకి అర్హుడు అని అంతే కాదు టైటిల్ గెలిచేది కూడా అతడే అని కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ పోస్ట్ చేస్తూ.. బాధపడకు అమర్ దీప్ అన్నా.. పక్కాగా కప్ మనదే. కెప్టెన్సీ దక్కకపోతే ఏంటి.. రాహుల్ సిప్లిగంజ్ కూడా కెప్టెన్ కాలేదు.. కానీ టైటిల్ గెలిచాడు.. ఈ సీజన్ మీరు గెలుస్తారు అని పోస్ట్ చేశారు. 

దీనితో అరియనా రీపోస్టు చేస్తూ.. ప్లీజ్ స్ట్రాంగ్ గా ఉండరా.. ఈ యూనివర్స్ నీ కోసం మరిన్ని పెద్ద ప్లాన్స్ తో ఉంది అని కామెంట్స్ చేసింది.సీజన్ 7 లో శివాజీ, ప్రశాంత్, ప్రియాంక, శోభా శెట్టి బలమైన కంటెస్టెంట్స్ గా ఉన్నారు. అమర్ దీప్ కూడా గట్టిగా పోరాడుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

మహేష్ బాబు బ్లాక్‌బస్టర్ అతడు మూవీకి ఫస్ట్ ఛాయస్ ఎవరంటే.? తెలిస్తే షాకవుతారు..
Mana Shankara Vara Prasad Garu 3 Days Collections: బాలయ్య లైఫ్‌ టైమ్‌ వసూళ్లని మూడు రోజుల్లోనే లేపేసిన చిరు