తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'సర్కార్'. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఘన విజయాలు అందుకోవడంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.
తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'సర్కార్'. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఘన విజయాలు అందుకోవడంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.
తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ అంచనాలకు తగ్గట్లుగానే ఉంది. విజయ్ తనదైన స్టయిల్ లో చెప్పే డైలాగులు టీజర్ కి హైలైట్ గా నిలిచాయి. 'ఐ యామ్ ఏ కార్పొరేట్ క్రిమినల్' అంటూ యాటిట్యూడ్ తో విజయ్ చెప్పిన డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
undefined
రాజకీయాలు, కార్పొరేట్ నేపధ్యంలో సాగే ఈ సినిమా దీపావళి సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేశ్ హీరోయిన్ గా కనిపిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, రాధారవి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులని అశోక్ వల్లభనేని దక్కించుకున్నారు.
సంబంధిత వార్త..
దసరా రోజు విజయ్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్!