రూ.14 కోట్లు కాదు.. విజయ్ సాయం రూ.70 లక్షలు!

Published : Aug 22, 2018, 11:19 AM ISTUpdated : Sep 09, 2018, 11:11 AM IST
రూ.14 కోట్లు కాదు.. విజయ్ సాయం రూ.70 లక్షలు!

సారాంశం

కేరళలో వరద బాధితుల సహాయార్ధం విజయ్ రూ.14 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. విజయ్ అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ ప్రమోట్ చేశారు

కేరళలో వరద బాధితుల సహాయార్ధం విజయ్ రూ.14 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. విజయ్ అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ ప్రమోట్ చేశారు. కానీ ఇందులో ఎంతవరకు నిజముందనే విషయం తెలియడం లేదు. విజయ్ తరఫు నుండి ఎవరూ ఈ విషయంపై స్పందించలేదు. దాన్ని పక్కన పెట్టేస్తే.. తాజాగా విజయ్ వరద బాధితులకు రూ.70 లక్షల సాయం అందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే అది ముఖ్యమంత్రి సహాయనిధికి కాకుండా తన భీమన సంఘాల ద్వారా ప్రత్యక్షంగా సాయం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్ తరఫు నుండి దీనికి సంబంధించిన సమాచారం వచ్చింది. ఆహార పదార్ధాలు, బట్టలు, దుప్పట్లు, పాలపొడి, శానిటరీ నేప్కిన్లు, మెడిసిన్ ఇలా చాలా వస్తువులను వరద ప్రభావిత ప్రాంతాలకు ట్రక్కుల ద్వారా పంపిస్తున్నారట.

అంతేకాదు.. తన అభిమాన సంఘాలు వరద బాధితులను కలిసి వారికి కావాల్సిన నగదుని కూడా ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు