
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ముందుగా మెగాఫ్యామిలీ హీరోల్లో ఒకరైన వరుణ్ తేజ్.. 'నాకు ఇన్స్పిరేషన్ అయిన మెగాస్టార్ కి హ్యాపీ బర్త్ డే' అని చెప్పగా.. సాయి ధరమ్ తేజ్.. 'నీపై మాకున్న ప్రేమ శాశ్వతం.. లవ్ యు మామ.. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్' అంటూ ట్వీట్ చేశారు. ఆయనతో కలిసి పని చేస్తోన్న హీరోయిన్ నయనతార.. చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. కొరటాల శివ, గుణశేఖర్, అల్లు అర్జున్, శ్రీకాంత్, శ్రీనువైట్ల ఇలా ఇండస్ట్రీలో ప్రముఖులందరూ కూడా ఆయనకు విషెస్ చెబుతూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నారు.