`కింగ్‌డమ్‌` మ్యూజిక్‌ డైరెక్టర్‌ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ.. ఏం ఇచ్చాడో తెలుసా?

Published : May 27, 2025, 11:16 PM IST
anirudh, vijay deverakonda

సారాంశం

రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ, తన `కింగ్‌డమ్‌` మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటో తెలుసా?

విజయ్ దేవరకొండ గిఫ్ట్  :  టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కింగ్‌డమ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా విజయ్ కెరీర్ కి చాలా ముఖ్యం. ఆయన నటించిన గత చిత్రాలు ప్లాప్ అవ్వడంతో, ‘కింగ్‌డమ్’ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. 

ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించడం విశేషం. ఇప్పటికే వచ్చిన టీజర్ కి అనిరుధ్ ఇచ్చిన బాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. విడుదలైన పాట కూడా విశేష ఆదరణ పొందింది. అందుకే, విజయ్ దేవరకొండ..అనిరుథ్‌ని తనదైన స్టయిల్‌ లో సర్‌ప్రైజ్‌ చేశాడు. 

విజయ్ దేవరకొండ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి?

ఈ మూవీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌ టైన్‌మెంట్‌ విడుదల చేసిన వీడియోలో, విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్ టీ షర్ట్ ని, బ్యాడ్మింటన్ రాకెట్ ని అనిరుధ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇద్దరూ కలిసి బ్యాడ్మింటన్ ఆడడానికి రెడీ అయ్యారు. అనిరుధ్ ఆ టీ షర్ట్ వేసుకున్నాడు. ఈ వీడియోని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోతో సినిమా ప్రమోషన్ మొదలుపెట్టారు. ‘కింగ్‌డమ్’ సినిమా జూలై 4, 2025 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

అనిరుధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో `కింగ్‌డమ్`

విజయ్ దేవరకొండ - అనిరుధ్ కాంబో `కింగ్‌డమ్‌` సినిమాకి హైలైట్ నిలుస్తుందని టీమ్‌ భావిస్తుంది.   ఈ మూవీలో విజయ్ దేవరకొండ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్, టీజర్‌లో ఆ విషయం స్పష్టమవుతుంది. టీజర్, పోస్టర్స్, మ్యూజిక్ అన్నీ ఇంటర్నెట్ లో సినిమాపై బాగా హైప్ క్రియేట్ చేశాయి. జూలై 4న వస్తున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి పెద్ద ట్రీట్ అవుతుందని అనుకుంటున్నారు.

ముందు `కింగ్‌డమ్` సినిమాని మే 30 న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా వర్క్ కాస్త పూర్తి కాకపోవడంతో జూలై 4 కి వాయిదా వేశారు. `కింగ్‌డమ్` సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించింది.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్
Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?