`స్పిరిట్‌` సినిమాకి త్రిప్తి డిమ్రీ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? జాక్‌ పాట్‌ అంటే ఇదే మరి

Published : May 27, 2025, 10:58 PM IST
Tripti Dimri

సారాంశం

దీపికా పదుకొనే స్థానంలో `యానిమల్‌` నటి త్రిప్తి డిమ్రీ `స్పిరిట్‌` మూవీలో హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.  ప్రభాస్‌ హీరోగా రూపొందే ఈ చిత్రానికిగానూ త్రిప్తి డిమ్రీ అందుకుంటున్న పారితోషికం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. 

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న `స్పిరిట్` సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. దీపికా పదుకొణె స్థానంలో త్రిప్తిని ఎంపిక చేశారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.  ఈ విషయాన్ని  దర్శకుడు  సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. 

ఒక్క పోస్ట్ తో సినిమా కాస్టింగ్ గురించి చాలా రోజులుగా జరుగుతున్న రూమర్లకి చెక్‌ పెట్టారు.  దీపికా పదుకొణె ఈ సినిమాకి భారీ పారితోషికం డిమాండ్ చేసిందట. అదే సమయంలో కొన్ని కండీషన్లు కూడా పెట్టిందట. సినిమాలో బోల్డ్ సీన్లు ఉన్నాయని, వాటి విషయంలో ఆమె అభ్యంతరం తెలిపిందని, అందుకే ఆమెని తప్పించారనే ప్రచారం జరుగుతుంది.  

త్రిప్తి డిమ్రీ `స్పిరిట్` కోసం ఎన్ని కోట్లు తీసుకుంటోంది?

 దీపికా పదుకొనేని ఈ సినిమా నుండి తొలగించడానికి ఆమె 20 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అడగడమే ప్రధాన కారణమని అంటున్నారు. అంతేకాకుండా, ఆమె ఇటీవలే తల్లి అయినందున షూటింగ్ సమయాన్ని తగ్గించాలని కూడా కోరిందట. ఇవన్నీ వంగాకి నచ్చలేదని చెబుతున్నారు. 

అందుకే ఆమె స్థానంలో `యానిమల్‌` నటి త్రిప్తి డిమ్రీకి `స్పిరిట్`లో ఆఫర్‌ ఇచ్చారు సందీప్‌. అయితే ఈ సినిమాకి త్రిప్తికి భారీగానే పారితోషికం తీసుకుంటుందట. ఆమెకి ఏకంగా 4 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు తెలుస్తుంది.   మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే త్రిప్తికిది జాక్ పాట్‌ అనే చెప్పాలి. 

త్రిప్తి డిమ్రీ `స్పిరిట్‌`లో పనిచేయడాన్ని ఇలా వెల్లడించింది

త్రిప్తి డిమ్రీ ఇటీవల సోషల్ మీడియాలో `స్పిరిట్` సినిమా ఆఫర్‌ రావడాన్ని కన్ఫమ్‌ చేసింది. దీన్ని షేర్ చేస్తూ, 'ఇంకా ఈ ప్రయాణంలో నన్ను నేను వెతుక్కుంటున్నాను... ఈ ప్రయాణంలో నాపై నమ్మకం ఉంచినందుకు చాలా కృతజ్ఞతలు సందీప్ రెడ్డి వంగా. మీ దృష్టిలో భాగం కావడం  గౌరవంగా ఉంది' అని రాసుకొచ్చింది. 

అదే సమయంలో, సందీప్ రెడ్డి వంగా కూడా త్రిప్తిని సినిమాలోకి స్వాగతిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, 'ఇప్పుడు నా సినిమాలో హీరోయిన్ అధికారికంగా ఖరారైంది' అని రాశారు. దీంతో పాటు, మరో పోస్ట్ షేర్ చేసి పేరు మెన్షన్‌ చేయకుండా దీపికా పదుకొణెని విమర్శించారు. తన కథని లీక్‌ చేసిందని, నమ్మకాన్ని బ్రేక్‌ చేసిందని,  యంగ్‌ యాక్టర్‌ని తక్కువ చేశారని, ఇదేనా ఫెమినిజం అని తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయారు సందీప్‌. దీంతో ఇది పెద్ద రచ్చ అవుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే