ఆ హీరోతో రొమాంటిక్‌ మూవీనా? తన కొత్త సినిమా వార్తలపై మణిరత్నం క్రేజీ కామెంట్

Published : May 27, 2025, 10:37 PM ISTUpdated : May 27, 2025, 10:38 PM IST
mani ratnam

సారాంశం

నవీన్ పోలిశెట్టి హీరోగా మణిరత్నం దర్శకత్వంలో కొత్త సినిమా అంటూ వార్తలు వచ్చాయి. ఇది ప్రేమకథ అని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఈ వార్తలను దర్శకుడు మణిరత్నం ఖండించారు.

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా మణిరత్నం దర్శకత్వంలో కొత్త సినిమా అంటూ వార్తలు వచ్చాయి. ఇది రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ అని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఈ వార్తలను దర్శకుడు మణిరత్నం ఖండించారు. ఇలాంటి వార్తలు ఎలా వ్యాపిస్తాయో తెలియదని ఆయన అన్నారు. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన వెల్లడించారు. 

`థగ్‌ లైఫ్‌` సెన్సార్‌ రిపోర్ట్ 

మణిరత్నం ప్రస్తుతం 'థగ్ లైఫ్' చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కలిసి చేస్తున్న ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది. ఈ మూవీ సెన్సార్‌ రిపోర్ట్ బయటకు వచ్చింది. దీనికి 'యు/ఎ' సర్టిఫికెట్ వచ్చింది.  నిడివి 165 నిమిషాలు. 

సినిమాలో శింబు, జోజు జార్జ్, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, నాజర్, అశోక్ సెల్వన్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, జిష్షు సేన్ గుప్తా, సాన్యా మల్హోత్రా, రోహిత్ శరాఫ్, వైయపురి వంటి తారాగణం నటిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.

ప్రమోషన్స్ లో `థగ్‌ లైఫ్‌` టీమ్‌ బిజీ 

మద్రాస్‌ టాకీస్‌, రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం కోసం టీమ్‌ జోరుగా ప్రచారం చేస్తుంది. ఆ మధ్య తెలుగులోనూ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. కమల్‌ హాసన్‌తోపాటు టీమ్‌ మొత్తం పాల్గొంది. ఇందులో కమల్‌ తెలుగు ఆడియెన్స్ వల్లే తాను స్టార్‌ అయ్యానని చెప్పడం విశేషం. కన్నడ, కేరళా, హిందీ, చెన్నైలోనూ ప్రమోషన్స్ చేస్తూ టీమ్‌ బిజీగా ఉంది. 

స్ట్రాంగ్‌ టెక్నికల్‌ టీమ్‌తో మణిరత్నం `థగ్‌ లైఫ్‌`

మణిరత్నంతో  ఎప్పటినుంచో పనిచేస్తున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఈ సినిమాకు కూడా పనిచేశారు. మణిరత్నం గత చిత్రాలైన 'కన్నత్తిల్ ముత్తమిట్టాల్', 'ఆయుధ ఎళుత్తు' లకు పనిచేసిన రవి కె చంద్రన్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రఫీ అందించారు.

 'విక్రమ్' సినిమాకు పనిచేసిన అన్బరివ్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశారు. రంజిత్ అంబాడి మేకప్, శర్మిష్టా రాయ్ ప్రొడక్షన్ డిజైన్, ఏకా లఖాని కాస్ట్యూమ్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇలా స్ట్రాంగ్‌ టెక్నీకల్‌ టీమ్‌ ఈ మూవీకి పనిచేస్తుండటం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?