విజయ్‌ దేవరకొండ సినిమా రేంజ్‌ని పెంచిన లీక్‌ ఫోటో.. VD12 టీమ్‌ రియాక్షన్ ఏంటంటే?

Published : Jul 23, 2024, 08:00 PM IST
విజయ్‌ దేవరకొండ సినిమా రేంజ్‌ని పెంచిన లీక్‌ ఫోటో.. VD12 టీమ్‌ రియాక్షన్ ఏంటంటే?

సారాంశం

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరితో `వీడీ12` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి లీక్‌ అయిన లుక్‌ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది.   

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ మొన్నటి వరకు ఫ్యామిలీ సినిమాలు చేశారు. `గీతా గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌`, `వరల్డ్ ఫేమస్ లవర్‌`, `ఖుషి`, `ఫ్యామిలీస్టార్` వంటి ఫ్యామిలీ సినిమాలతో వచ్చాడు. మధ్యలో `లైగర్‌` వంటి యాక్షన్‌ మూవీ చేసినా వర్కౌట్‌ కాలేదు. చివరగా చేసిన `ఫ్యామిలీ స్టార్‌` నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కంప్లీట్‌గా రూట్‌ మార్చాడు విజయ్‌. వరుసగా యాక్షన్‌ మూవీస్‌ చేస్తున్నాడు. అందులో భాగంగా గౌతమ్‌ తిన్ననూరితో గ్యాంగ్‌ స్టర్‌ ప్రధానంగా సాగే కథతో `వీడీ12` సినిమా చేస్తున్నారు.  

ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం శ్రీలంకలో చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యాడు. ఆయన లీక్‌ లుక్‌ వైరల్‌ అవుతుంది. ఇందులో ట్రిమ్‌ హెయిర్‌, గెడ్డంతో ఊరమాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు విజయ్‌. ఇంకా చెప్పాలంటే ఇది వీరమాస్‌ లుక్‌. కళ్లజోడు పెట్టుకుని స్టయిల్‌గా ఉన్నాడు. మాస్‌, స్టయిల్‌ మేళవింపుతో ఉన్న ఈ పిక్ సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. 

దీంతోపాటు సముద్రపు బీచ్‌ వెంట బైక్‌పై వెళ్తున్నాడు విజయ్‌. బైక్‌ని ఒకరు డ్రైవ్‌ చేస్తుండగా వెనకాల కూర్చొని గెడ్డం పట్టుకుని కనిపిస్తున్నాడు విజయ్‌. ఇందులోనూ సేమ్‌ లుక్‌లో ఉన్నాడు విజయ్‌. లీక్‌ అయిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ కావడమే కాదు, ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. ఈ లుక్‌ సినిమాపై అంచనాలను పెంచుతుంది. గ్యాంగ్‌ స్టర్ మూవీ కావడంతో దానికి తగ్గట్టుగానే విజయ్‌ లుక్‌ లీక్‌ కావడంతో సినిమా వేరే స్థాయిలో ఉండబోతుందనే సాంకేతాలనిస్తుంది. 

తాజాగా దీనిపై టీమ్‌ స్పందించింది. షూటింగ్‌ డిటెయిల్స్ ని పేర్కొంది. సినిమాని థియేటర్లో బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని, అందుకోసం నిర్విరామంగా వర్క్ చేస్తున్నట్టు తెలిపింది టీమ్‌. ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్‌ జరుగుతుందని, ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందని, మున్ముందు ఫస్ట్ లుక్‌, సినిమా అప్‌ డేట్‌ ఇచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నామని, అవన్నీ ప్రాపర్‌గా అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే ప్రస్తుతం లీక్ అయిన లుక్‌ గురించి చెబుతూ, తాము అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్‌ చేయండి, లీక్‌ పోస్టర్స్ షేర్‌ చేయకండి అని రిక్వెస్ట్ చేసింది టీమ్‌.

`వీడీ12` నుంచి విజయ్‌ లుక్‌ లీక్ అయితే అయ్యింది కానీ, ఇది సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేస్తుంది. ఇన్నాళ్లు ఈ సినిమాకి సంబంధించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ ఒక్క లీక్ పిక్‌తో సోషల్‌ మీడియా మొత్తం విజయ్‌ దేవరకొండనే కనిపిస్తున్నాడు. ఇది ఓ రకంగా సినిమాకి ప్లస్సే అవుతుందని చెప్పొచ్చు. అధికారికంగా ప్రకటిస్తే నానా రకాలుగా వివాదాలు చేస్తుంటారు. కాపీ అంటుంటారు. కానీ లీక్‌ పిక్స్ తో ఆ గొడవ ఉండదు, పైగా ఎక్కువగా మైలేజ్‌ వస్తుంది. ఇప్పుడు విజయ్‌ సినిమాకి అదే జరిగింది. ఈ పిక్‌ దుమ్మురేపుతుండటం విశేషం. విజయ్‌ లుక్కే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక సినిమా ఏం రేంజ్‌లో ఉంటుందో అని ఊహించుకుంటున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా  నటిస్తుంది. సితార ఎంటర్ టైన్‌మెంట్స్, ఫార్వ్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు