బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రభాస్ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడా? ఇదేం లాజిక్!

By Sambi ReddyFirst Published Jul 23, 2024, 9:34 AM IST
Highlights

హీరో ప్రభాస్ కల్కి 2829 AD తో రూ. 1000 కోట్లు కొల్లగొట్టాడు. ఆయన మార్కెట్ రేంజ్ ఇంకా పెరిగింది. అనూహ్యంగా ప్రభాస్ రెమ్యూనరేషన్ తగ్గించాడన్న వార్త ఆసక్తికరంగా మారింది... 
 


కల్కి 2829 AD మూవీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిభను దేశవ్యాప్తంగా మెచ్చుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు సైతం నాగ్ అశ్విన్ మీద ప్రశంసలు కురిపించడం విశేషం. మహాభారతంలోని పాత్రలను, భవిష్యత్ ప్రపంచాన్ని... కల్కి రాకతో ముడిపెట్టి నాగ్ అశ్విన్ ఒక సరికొత్త కథను సిద్ధం చేసుకున్నాడు. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ అంటూ కొత్త జోనర్ పరిచయం చేశాడు. 

హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన కల్కి చిత్రం ప్రేక్షకులకు గొప్ప అనుభూతి పంచింది అనడంలో సందేహం లేదు. అలాగే భైరవగా ప్రభాస్ పాత్రను నాగ్ అశ్విన్ వినూత్నంగా రూపొందించాడు. భైరవ పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఆపాదించాడు. అమితాబ్ పోషించిన అశ్వద్ధామ రోల్ సినిమాకు హైలెట్. భైరవ-అశ్వద్ధామ కాంబోలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ గూస్బంప్స్ రేపుతాయి. దీపికా పదుకొనె, కమల్ హాసన్ కల్కి చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు చేశారు. శోభన, రాజేంద్ర ప్రసాద్, పశుపతి కీలక రోల్స్ చేసిన సంగతి తెలిసిందే.

Latest Videos

కాగా బాహుబలి 2 అనంతరం ప్రభాస్ మార్కెట్ భారీగా పెరిగింది. పాన్ ఇండియా హీరోగా రూ. 100 కోట్లకు రెమ్యునరేషన్ పెంచేశాడు. కల్కి చిత్రానికి ఏకంగా రూ. 150 కోట్లు తీసుకున్నాడని సమాచారం. కల్కి సక్సెస్ నేపథ్యంలో ప్రభాస్ రెమ్యూనరేషన్ ఇంకా పెంచేస్తాడనే టాక్ వినిపిస్తుంది. అందుకు భిన్నంగా ప్రభాస్ రెమ్యూనరేషన్ తగ్గించాడట. 

రాజా సాబ్ చిత్రానికి ప్రభాస్ రూ. 100 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడు అనేది లేటెస్ట్ న్యూస్. ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. కామెడీ హారర్ జోనర్లో మూవీ తెరకెక్కుతుందట. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కొంత మేర ఈ మూవీ షూటింగ్ జరుపుకుంది.
 

click me!