జగన్ పాత్రలో విజయ్ దేవరకొండ..?

Published : Sep 14, 2018, 01:46 PM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
జగన్ పాత్రలో విజయ్ దేవరకొండ..?

సారాంశం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జీవిత చరిత్రతో దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జీవిత చరిత్రతో దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, సాంగ్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాకు మరింత హైప్ యాడ్ చేయడానికి టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండని రంగంలోకి దింపుతున్నాయని సమాచారం. వైఎస్సార్ తనయుడు జగన్ పాత్ర కోసం కోలీవుడ్ హీరోలు సూర్య లేదా కార్తీలను తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి.

కానీ చిత్రబృందం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా జగన్ పాత్ర కోసం విజయ దేవరకొండని తీసుకునే ఆలోచన చేస్తుందట చిత్రబృందం. విజయ్ దేవరకొండని తీసుకోవడం వలన మార్కెట్ పరంగా సినిమాకు మరింత క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉండడంతో అతడికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం.

అయితే విజయ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో జగన్ పాత్రకి ఓకే చెబుతాడో లేదో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: హీరోలు ఒకరి తర్వాత ఒకరు..దుబాయ్ మోజు వెనుక ఇదే కారణం!
Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు