'యూటర్న్' ఫస్ట్ డే కలెక్షన్స్!

Published : Sep 14, 2018, 01:26 PM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
'యూటర్న్' ఫస్ట్ డే కలెక్షన్స్!

సారాంశం

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'యూటర్న్'. కన్నడ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమాకు రూ.12 కోట్ల మార్కెట్ జరగగా.. తమిళంలో రూ.4 కోట్లు ప్రీరిలీజ్ మార్కెట్ తో విడుదల చేశారు

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'యూటర్న్'. కన్నడ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమాకు రూ.12 కోట్ల మార్కెట్ జరగగా.. తమిళంలో రూ.4 కోట్లు ప్రీరిలీజ్ మార్కెట్ తో విడుదల చేశారు.

తెలుగు రూ.12 కోట్లు సాధిస్తే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతుంది. నిజానికి ఇది పెద్ద టార్గెట్ అనే చెప్పాలి. సమంత సోలోగా నటించిన ఈ సినిమా రూ.12 కోట్లు వసూలు చేయాలంటే మామూలు విషయం కాదు. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, యూత్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఈ సినిమా మంచి వసూళ్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తొలిరోజు కూడా సినిమా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. అమెరికాలో ఈ సినిమా రూ.60 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వివరాలు తెలియాల్సివున్నాయి. నాగచైతన్య 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ తొలిరోజు ఈ సినిమా ఓవర్సీస్ లో కోటి పది లక్షల రూపాయలు వసూలు చేసింది. 

ఇది కూడా చదవండి.. 

రివ్యూ: యూటర్న్

 

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: హీరోలు ఒకరి తర్వాత ఒకరు..దుబాయ్ మోజు వెనుక ఇదే కారణం!
Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు