'శైలజా రెడ్డి అల్లుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

By Udayavani DhuliFirst Published Sep 14, 2018, 12:31 PM IST
Highlights

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'శైలాజా రెడ్డి అల్లుడు' సినిమా వినాయకచవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'శైలాజా రెడ్డి అల్లుడు' సినిమా వినాయకచవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రానప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం భారీగా లభించాయి. నిన్నటిరోజ్కు సెలవు దినం కావడంతో సినిమాకు మంచి వసూళ్లు దక్కాయని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ సినిమా తొలిరోజు రూ.5 కోట్ల పది లక్షల రూపాయలను వసూలు చేసింది. ప్రాంతాల వారీగా.. 

నైజాం.. 1.65 కోట్లు 
కృష్ణ... 40 లక్షలు 
వెస్ట్.. 41 లక్షలు 
ఈస్ట్.. 52 లక్షలు 
వైజాగ్.. 59.9 లక్షలు 
గుంటూరు.. 58.7 లక్షలు
నెల్లూరు.. 23 లక్షలు 
సీడెడ్.. 81 లక్షలు

ఓవరాల్ గా ఈ సినిమా రూ.5.10 కోట్ల రూపాయలను వసూలు చేసింది. నాగచైతన్య కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ అని చెప్పాలి. చైతు మార్కెట్ కి మారుతి కూడా తోడవ్వడంతో ఓపెనింగ్స్ ఈ స్థాయిలో వచ్చాయని చెప్పాలి. కర్నాటకలో ఈ సినిమా దాదాపు రూ.40 లక్షల రూపాయలను వసూలు చేసింది. ఈ లాంగ్ వీకెండ్ లో సినిమాకు మరిన్ని టికెట్లు తెగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి..

రివ్యూ: శైలజా రెడ్డి అల్లుడు

click me!