'డియర్ కామ్రేడ్' సినిమాకి విజయ్ దేవరకొండ రిపేర్లు!

Published : Feb 12, 2019, 05:00 PM IST
'డియర్ కామ్రేడ్' సినిమాకి విజయ్ దేవరకొండ రిపేర్లు!

సారాంశం

వరుస విజయాలతో దూకుడు మీదున్న నటుడు విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'డియర్ కామ్రేడ్' సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. 

వరుస విజయాలతో దూకుడు మీదున్న నటుడు విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'డియర్ కామ్రేడ్' సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు.

సోషల్ మెసేజ్ తో కూడిన యాక్షన్ డ్రామాగా సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. దీంతో విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయాడు. క్రాంతి మాధవ్ ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇ

ది ఇలా ఉండగా.. 'డియర్ కామ్రేడ్' సినిమా ఫస్ట్ కాపీను చూసిన విజయ్ అసంతృప్తి వ్యక్తం చేశాడట. కొన్ని సన్నివేశాలను తిరిగి రీషూట్ చేయాలని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకూడదని సూచించాడట.

ఫైనల్ కాపీ సిద్ధమైన తరువాత రిలీజ్ డేట్ ప్రకటించాలని చెప్పినట్లు సమాచారం. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. మే నెలలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
PREV
click me!

Recommended Stories

Srinivasa Mangapuram 5 Days Collections: శ్రీనివాస మంగాపురంకి షాకింగ్‌ కలెక్షన్లు.. మహేష్‌ అన్న కొడుక్కి ఇది ఊహించలేం
Newtons 3rd Law 4 Days Collections: సుమంత్‌ మూవీకి దారుణమైన కలెక్షన్లు.. కనీసం హీరో రెమ్యూనరేషన్‌ కూడా రాలేదా?