మెగా బూస్టర్ బాపినీడు.. బిగ్ బాస్ తో కెరీర్ ఎండ్!

By Prashanth MFirst Published Feb 12, 2019, 4:50 PM IST
Highlights

అప్పటివరకు చిరంజీవి అని పిలవబడే కొణిదెల శివప్రసాద్ గారికి మెగా స్టార్ బిరుదు వచ్చేలా అసలైన బీజం వేసి తెలుగు జనాల్లో అభిమానం అనేదాన్ని పాతుకుపోయేలా చేసిన దర్శకుడు ఆయన. కెరీర్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా 23 సినిమాల వరకు 30 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో కొనసాగారు విజయ బాపినీడు.

అప్పటివరకు చిరంజీవి అని పిలవబడే కొణిదెల శివప్రసాద్ గారికి మెగా స్టార్ బిరుదు వచ్చేలా అసలైన బీజం వేసి తెలుగు జనాల్లో అభిమానం అనేదాన్ని పాతుకుపోయేలా చేసిన దర్శకుడు ఆయన. కెరీర్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా 23 సినిమాల వరకు 30 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో కొనసాగారు విజయ బాపినీడు.

మెగాస్టార్ కి కెరీర్ కి బూస్ట్ ఇచ్చి కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పారు. మొదటగా చిరంజీవి తో పట్నం వచ్చిన పతివ్రతలు(1982) అనే సినిమా చేసి ఇండస్ట్రీలో అందరిని దృష్టిని ఆకర్షించారు. ఆ సినిమాలో మరోహీరోగా యాక్ట్ చేసిన మోహన్ బాబు కెరీర్ కూడా మలుపు తిరిగింది. ఇక నెక్స్ట్ మెగాస్టార్ తో చేసిన మగమహారాజుతో మెగాస్టార్ - విజయ బాపినీడు కాంబోకి క్రేజ్ ఏర్పడింది. 

అనంతరం మహానగరంలో మాయగాడు సినిమా మెగాస్టార్ ని అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గర చేసింది. అనంతరం హీరో - మగధీరుడు - మగమహారాజు సినిమాలు బాగానే ఆడాయి. అయితే అనుకున్నంతగా ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో ఎన్నో రోజులు కష్టపడి రైటర్స్ తో ఖైదీ నెంబర్ 786(1988) కథను సిద్ధం చేసుకున్న విజయ బాపినీడు ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. 

దీంతో ఈ మెగా కాంబో పై అంచనాలు మరింతగా పెరగడంతో నెక్స్ట్ కథ మరింత స్ట్రాంగ్ గా ఉండాలని గ్యాంగ్ లీడర్(1991) తో ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ కాంబినేషన్ అసలైన బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది. ఆ సినిమాతో అసలైన మెగాస్టార్ గా చిరంజీవికి గుర్తింపు దక్కింది. ఆ సినిమా అప్పట్లో 7కోట్ల లాభాలను అందించి ఆ సమయంలో ఆ సినిమానే టాప్ హిట్ గా నిలిచింది.  

ఇక మూడుమూడేళ్ళ అనంతరం విజయ బాపినీడు మెగాస్టార్ తో చేసిన బిగ్ బాస్(1995) అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఆ సినిమా ఊహించని విధంగా ఆ సమయంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమాతోనే దాదాపు విజయ్ బాపినీడు కెరీర్ ముగిసింది. అంతవరకు రాజేంద్ర ప్రసాద్ వంటి హీరోలను కవర్ చేసిన కూడా అనంతరం ఆయన అనుకున్న సినిమాలు చాలా వరకు పట్టాలెక్కలేదు. 

బిగ్ బాస్ అనంతరం చివరగా ఫ్యామిలీ (1996) - కొడుకులు (1998) అనే సినిమాలతో ఆయన కెరీర్ కు పూర్తిగా ఎండ్ కార్డ్ పడింది. ఆ తరువాత కూడా ఆయన పలు కథలపై చర్చలు సాగించారు కానీ ఆరోగ్యపరిస్థితులు ఇతర కారణాల వల్ల సినిమాలు చేయలేకపోయారు. మొత్తానికి చిరంజీవితో 7 సినిమాలు తెరకెక్కించి మెగాస్టార్ గా జనాలకు దగ్గర చేయడంలో విజయ బాపినీడుపాత్ర చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు.  

గ్యాంగ్ లీడర్ దర్శకుడు కన్నుమూత!

మెగా విజయ బాపినీడు.. స్పెషల్ వింటేజ్ ఫొటోస్

గ్యాంగ్ లీడర్ దర్శకుడికి మెగాస్టార్ నివాళి (ఫొటోస్)

డైరెక్టర్ విజయ బాపినీడుకి సినీ తారల నివాళి (ఫొటోస్)

 

click me!