అనసూయ అందంపై కవిత.. అలీ స్పెషల్ ఇంటరెస్ట్!

Published : Feb 12, 2019, 04:39 PM ISTUpdated : Feb 12, 2019, 04:41 PM IST
అనసూయ అందంపై కవిత.. అలీ స్పెషల్ ఇంటరెస్ట్!

సారాంశం

యాంకర్ అనసూయకి 'రంగస్థలం' సినిమాలో నటించినందుకు మంచి పేరే వచ్చింది. ఈ సినిమాకు గాను ఆమెకి అవార్డులు కూడా దక్కుతున్నాయి. 

యాంకర్ అనసూయకి 'రంగస్థలం' సినిమాలో నటించినందుకు మంచి పేరే వచ్చింది. ఈ సినిమాకు గాను ఆమెకి అవార్డులు కూడా దక్కుతున్నారు. ఇటీవల జరిగిన జీ అవార్డుల కార్యక్రమంలో ఆమె ఉత్తమ సహాయనటి కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా స్టేజ్ పైకి వచ్చిన అనసూయకి కమెడియన్ అలీ ఓ కవిత చదివి వినిపించాడు.

అది అతడు రాసిన కవిత కాదులెండి.. అనసూయ అభిమానుల్లో ఒకరు ఆమె అందాన్ని పొగుడుతూ సోషల్ మీడియాలో ఓ కవిత పోస్ట్ చేశారు. ఇది అలీ కంట పడడంతో అనసూయ కోసం ఓ కవిత తెచ్చానంటూ స్టేజ్ మీద హడావిడి చేయగా యాంకర్ శ్రీముఖి ఆ కవితని చదివి వినిపించింది. 

''ఆడదానికే అందం నీ అందం
నెలవంక లాంటి నీ నుదుట కుంకుమ అందం
నీ సోగ కనులకు కాటుక అందం
నీ సొట్టబుగ్గలకు సిగ్గు అందం
నీ అధరాలకు చిరునవ్వు అందం
నీ ఒంపుసొంపులకు చీరకట్టు అందం
ఆ వన్నెలన్నీ నువ్వైతే నింగి అంత అందం''

ఈ కవిత విన్న అనసూయ సదరు నెటిజన్ కి ధన్యవాదాలు తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా