ట్రెండింగ్ లో విజయ్ దేవరకొండ ప్రేమకావ్యం!

Published : Nov 20, 2018, 04:53 PM IST
ట్రెండింగ్ లో విజయ్ దేవరకొండ ప్రేమకావ్యం!

సారాంశం

టాలీవుడ్ లో హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. తాజాగా ఆయన నటించిన 'టాక్సీవాలా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు విజయ్ దేవరకొండ. 

టాలీవుడ్ లో హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. తాజాగా ఆయన నటించిన 'టాక్సీవాలా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది.

దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్ నటించిన ఫస్ట్ మ్యూజిక్ వీడియో 'నీ వెనకాలే నడిచి' అనే పాటను యూట్యూబ్ లో విడుదల చేశారు.

విజయ్ దేవరకొండ, మలోబికాలపై చిత్రీకరించిన ఈ పాట రొమాంటిక్ మెలోడీ సాంగ్ తో యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే ఈ పాటను ఆరు లక్షల మంది వీక్షించారు. ఒక ప్రేమకథను పాట రూపంలో అందంగా చూపించారు.

అనంత్ శ్రీరాం లిరిక్స్, సింగర్ చిన్మయి వాయిస్, సౌరభ్-దుర్గేశ్ ల ట్యూన్ ఈ పాటను మళ్లీ మళ్లీ వినేలా చేస్తున్నాయి. మీరు కూడా ఒకసారి వినేయండి!

PREV
click me!

Recommended Stories

'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య
అభిమానులకు అక్కినేని కోడలు సూపర్ గుడ్‌న్యూస్.. పెళ్లైన ఇన్ని రోజులకు..!