దీపిక - రణ్ వీర్ వెడ్డింగ్..అసలైన పార్టీ ఎప్పుడంటే!

Published : Nov 20, 2018, 04:43 PM ISTUpdated : Nov 20, 2018, 04:45 PM IST
దీపిక - రణ్ వీర్ వెడ్డింగ్..అసలైన పార్టీ ఎప్పుడంటే!

సారాంశం

మొన్నటివరకు బాలీవుడ్ స్టార్ లవర్స్ గా పిలవబడిన దీపిక పదుకొనె - రణ్ వీర్ సింగ్ ఇప్పుడు బ్యూటిఫుల్ కపుల్స్ గా మారారు. రోజుకో వేడుకతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. 

మొన్నటివరకు బాలీవుడ్ స్టార్ లవర్స్ గా పిలవబడిన దీపిక పదుకొనె - రణ్ వీర్ సింగ్ ఇప్పుడు బ్యూటిఫుల్ కపుల్స్ గా మారారు. రోజుకో వేడుకతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాల్లో పెళ్లి చేసుకొని రీసెంట్ గా ఈ కపుల్స్ ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. సంప్రదాయాల ప్రకారం మరిన్ని వేడుకలను ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 

 

ఇక  బెంగుళూరులో గ్రాండ్ గా రిసిప్షన్ జరగనుంది.  బుధవారం రోజు జరగనున్న ఈ వేడుకకు పెళ్లికి హాజరుకాలేకపోయిన ప్రముఖ నటీనటులు సన్నిహితులు అలాగే ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రోజు బెంగుళూరుకు వచ్చిన దీపిక రణ్వీర్ ను చూడటానికి అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. 

ఇటలీలోని ప్రముఖ లేక్ కోమోలో ఈ జంట ఇరు కుటుంబాల ఆచారాలను గౌరవించి రెండు సార్లు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. కొంకణి - సింధు సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ముంబైలో కూడా ఈ బాలీవుడ్ జంట మరో పార్టీని నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పట్లో అయితే ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఆగేలా లేవు అని టాక్. 

PREV
click me!

Recommended Stories

అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య