అమీర్ పై ట్రోలింగ్.. నెటిజన్లపై హీరో ఫైర్!

By Udayavani DhuliFirst Published Nov 20, 2018, 4:32 PM IST
Highlights

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కి ప్రేక్షకుల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా ఆడియన్స్ ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే హీరో ఎవరు..? డైరెక్టర్ ఎవరు..? ఇలా అన్ని చూసుకొని సినిమాకు వెళ్తుంటారు. 

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కి ప్రేక్షకుల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా ఆడియన్స్ ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే హీరో ఎవరు..? డైరెక్టర్ ఎవరు..? ఇలా అన్ని చూసుకొని సినిమాకు వెళ్తుంటారు.

కానీ అమీర్ ఖాన్ సినిమా అంటే డైరెక్టర్ ఎవరని కూడా చూడరు. సినిమా కోసం ఎగబడతారు. అంత క్రేజ్ ఉంది అమీర్ ఖాన్ కి.. ఇదే నమ్మకంతో 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమాకి వెళ్లిన ఆడియన్స్ కి చుక్కెదురైంది. బాహుబలిని మించిన సినిమా అవుతుందని అనుకుంటే డిజాస్టర్ టాక్ తెచ్చుకొని షాక్ ఇచ్చింది ఈ సినిమా. అమీర్ ఖాన్ అసలు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడంటూ సోషల్ మీడియాలో అతడిని విపరీతంగా ట్రోల్ చేశారు కొందరు నెటిజన్లు. 

ఈ ట్రోలింగ్ అమీర్ ఖాన్ అభిమానులను బాధకి గురి చేసింది. అమీర్ ని అభిమానించే వారిలో టాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ఒకడు. అమీర్ ని ట్రోల్ చేస్తున్న వారికి సమాధానంగా రాహుల్ ఓ ట్వీట్ చేశాడు. ''అమీర్ ఖాన్ ఇండియన్ సినిమాలలో విప్లవం తెచ్చాడు. ఒంటి చేత్తో మన సినిమాల రాత మార్చాడు. తన అభిరుచితో గొప్ప గొప్ప సినిమాలు అందించాడు.

కొన్ని సార్లు సొంతంగా డబ్బులు పెట్టి పెద్ద సాహసాలే చేశాడు. అలాంటి వ్యక్తిని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. అయినా దశాబ్దానికి ఓ ఫ్లాప్ ఇస్తే అందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముంది. దీనికి ట్రోల్ చేయడం ఏంటి..?'' అంటూ ప్రశ్నించారు. రాహుల్ అభిప్రాయంతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు మాత్రం అమీర్ ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. 

click me!