విజయ్‌ దేవరకొండ మరో సంచలనం.. సౌత్‌ నుంచి ఫస్ట్ హీరో!

Published : Jun 14, 2021, 06:41 PM IST
విజయ్‌ దేవరకొండ మరో సంచలనం.. సౌత్‌ నుంచి ఫస్ట్ హీరో!

సారాంశం

 విజయ్‌ దేవరకొండ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపాడు. పాపులర్‌ బాలీవుడ్‌ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నాని క్యాలెండర్‌లో చోటు సంపాదించుకున్నాడు. 

విజయ్‌ దేవరకొండ మరో సంచలనంగా మారారు. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌లో, అలాగే మోస్ట్ డిజైరబుల్‌ మెన్‌గా నిలిచిన సంచలనంగా మారిన విజయ్‌ దేవరకొండ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపాడు. పాపులర్‌ బాలీవుడ్‌ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నాని క్యాలెండర్‌లో చోటు సంపాదించుకున్నాడు. సౌత్‌ నుంచి ఈ క్యాలెండర్‌ కోసం పోజులిచ్చిన ఫస్ట్ హీరో విజయ్‌ కావడం విశేషం. సౌత్‌ తోపాటు నార్త్ లోనూ విజయ్‌కి ఉన్న క్రేజ్‌ని తెలియజేస్తుంది. 

దీనితో బాలీవుడ్ స్టార్ ల సరసన విజయ్ ఆ క్యాలెండర్ లో కనిపించాడు. చేసిన 9 సినిమాలకే ఇలాంటి నేషనల్ క్రేజ్ సంపాదించడం గమనార్హం. దీనికి సంబంధించిన స్టన్నింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు డబూ రత్నాని. రగ్గ్ డ్ అండ్ స్టైలిష్ లుక్ లో విజయ్ సెక్సీగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ను లాంచ్ చేసిన సందర్భంగా విజయ్ తో ఇన్ స్టా గ్రామ్ లైవ్ ముచ్చటించాడు డబూ.

 విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, `ఈ ఫోటో షూట్ చాలా తొందరగా, చాలా క్వాలిటీగా జరిగింది. కొన్నేళ్ల నుండి నాకు నచ్చిన ఎంతో మంది స్టార్స్ మీ క్యాలెండర్ లో కనిపించారు. షారుఖ్ ఖాన్ సర్ ను మీ క్యాలెండర్ లో చూశా. తను చాలా మంచి వ్యక్తి. అప్పటినుండి నాకు మీ క్యాలెండర్ లో కనిపిస్తే బాగుంటుంది అనుకునేవాడిని. ఫైనల్ గా నా కోరిక తీరింది` అని తెలిపాడు. 

ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నాని మాట్లాడుతూ, `థాంక్యూ విజయ్ దేవరకొండ నా క్యాలెండర్ లో డెబ్యూ చేసినందుకు. మీరు చాలా కూల్ పర్సన్. ఈ ఫొటో షూట్ చేసినపుడు చాలా ఎంజాయ్ చేసాను. నా క్యాలెండర్ లో కనిపించిన ఫస్ట్ సౌత్ యాక్టర్ మీరు. నేను షూట్ చేసిన బెస్ట్ డెబ్యూ ఫొటోషూట్ మీదే. ధన్యవాదాలు` అని తెలిపారు.  ప్రస్తుతం విజయ్‌ తెలుగు, హిందీలో `లైగర్‌` చిత్రంలో నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. అనన్య పాండే హీరోయిన్‌. ఇది పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు