`దిశ` సినిమా పేరు మార్పు.. విడుదలకు మరో రెండు వారాలుః హైకోర్ట్‌

Published : Jun 14, 2021, 04:14 PM IST
`దిశ` సినిమా పేరు మార్పు.. విడుదలకు మరో రెండు వారాలుః హైకోర్ట్‌

సారాంశం

రామ్‌గోపాల్‌ రూపొందించిన `దిశ` సినిమా పేరు మార్చాలని హైకోర్ట్ తెలిపింది. దీంతో సినిమా పేరుని `ఆశః ఎన్‌కౌంటర్‌`గా మార్చారు దర్శక నిర్మాతలు. `దిశ` సినిమాపై దిశ తండ్రి కోర్ట్స్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

రామ్‌గోపాల్‌ రూపొందించిన `దిశ` సినిమా పేరు మార్చాలని హైకోర్ట్ తెలిపింది. దీంతో సినిమా పేరుని `ఆశః ఎన్‌కౌంటర్‌`గా మార్చారు దర్శక నిర్మాతలు. `దిశ` సినిమాపై దిశ తండ్రి కోర్ట్స్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం విచారణ చేపట్టిన హైకోర్ట్ తుది తీర్పుని వెల్లడించింది. 

ఇప్పటికే ఈ సినిమాకి ఏప్రిల్‌ 16న సెన్సార్‌ పూర్తయ్యిందని, `ఏ` సర్టిపికేట్‌ ఇచ్చినట్టు సెన్సార్‌ బోర్డ్ వెల్లడించింది. అయితే సినిమాని మరో రెండు వారాల పాటు విడుదల నిలిపివేయాలని తెలిపింది. `దిశ` సినిమా కేసు గతేడాది నుంచి హైకోర్ట్ లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. 

రెండేళ్ల క్రితం శంషాబాద్‌ సమీపంలో `దిశ`ని కొందరు దుండగులు రాత్రి సమయంలో అత్యాచారం చేసి హత్య చేసిన విషయంతెలిసిందే. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఘటన ఆధారంగా రామ్‌గోపాల్‌ వర్మ `దిశః ఎన్‌కౌంటర్‌` పేరుతో సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. వర్మ,ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహించగా, నట్టి కుమార్ నిర్మించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు