ఆ పని చేయను.. ఛాన్సే లేదు.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

Published : Mar 30, 2019, 04:52 PM IST
ఆ పని చేయను.. ఛాన్సే లేదు.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఎంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందో చెప్పనక్కర్లేదు.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఎంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం స్టార్లంతా కూడా వెబ్ సిరీస్, టీవీ షోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇదే విషయాన్ని విజయ్ దేవరకొండ వద్ద ప్రశ్నించగా.. ఛాన్సే లేదని సమాధానమిచ్చాడు. డిజిటల్ మార్కెట్ భారీగా విస్తరిస్తుండడంతో సెలబ్రిటీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. విజయ్ దేవరకొండ మాత్రం డిజిటల్ మీడియాకి నో చెప్పేశాడు.

తనను తాను బుల్లితెరపై చూసుకోవడం ఇష్టం లేదని చెప్పేశాడు. అంటే బుల్లితెరపై షోలు కూడా చేసే ఛాన్స్ లేదన్నమాట. అయితే ఫ్యూచర్ లో వెబ్ సిరీస్ ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిపాడు.

ప్రస్తుతం విజయ్ నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇది ఇలా ఉండగా.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?