'సూర్యకాంతం' దెబ్బకొట్టకపోతే 'మహర్షి' రైట్స్ మావే..!

Published : Mar 30, 2019, 03:20 PM ISTUpdated : Mar 30, 2019, 03:43 PM IST
'సూర్యకాంతం' దెబ్బకొట్టకపోతే  'మహర్షి' రైట్స్ మావే..!

సారాంశం

నీహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించిన‌ 'సూర్యకాంతం' నిన్న శుక్ర‌వారం విడుదలయింది. 

నీహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించిన‌ 'సూర్యకాంతం' నిన్న శుక్ర‌వారం విడుదలయింది.  ఈ సినిమాతో పాటే రిలీజైన లక్ష్మీస్ ఎన్టీఆర్ కలెక్షన్స్ విషయంలో స్పీడుగా దూసుకుపోతూంటే...సూర్యకాంతం మాత్రం స్టక్ అయ్యిపోయింది.  ఓవర్ సీస్ లో మంచి పేరున్న  డిస్ట్రిబ్యూటర్లు నిర్వాణ సంస్థ నిర్మాణ రంగంలోకి దిగి, నిర్మించిన సినిమా ఇది కావటంతో ట్రేడ్ వర్గాలు ఈ సినిమాపై మంచి ఆశలే పెట్టుకున్నారు. 

ఈ నిర్మాతలు  నిర్మించిన తొలి చిత్రం మను సినిమా డిజాస్టర్. ఆ సినిమాని మించిపోయింది మిస్ సూర్యకాంతం. ట్రేడ్ లో చెప్పుకునేదాని ప్రకారం ఈ  సినిమాకు బిజినెస్ పెద్దగా జరగలేదు. దిల్ రాజు తీసుకుని రిలీజ్ చేసారు. దాదాపు అందరూ క్యూబ్ ఖర్చులు పెట్టుకుని మరీ ఓన్ రిలీజ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఓపినింగ్స్ రాబట్టుకోలేకపోయిన ఈ సినిమా..మరో ఫ్లాఫ్ గా మిగిలిపోయింది.

మరో ప్రక్క ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నిర్వాణ సంస్ధ చాలా ఆశలు పెట్టుకుందట. ఈ సినిమా హిట్ అయితే వచ్చే డబ్బులతో  మహర్షి సినిమా ఓవర్ సీస్ రైట్స్ కొనాలనుకున్నారట నిర్వాణ నిర్వాహకులు. అయితే సూర్య కాంతం దెబ్బ కొట్టేసింది. దాంతో మహర్షి పై పెట్టుబడి పెట్టే నిర్ణయాన్ని కూడా ప్రక్కన పెట్టేసిందిట సంస్ద. 

 

PREV
click me!

Recommended Stories

Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు