పెళ్లయ్యాక అవే సీన్లు చేస్తే ఎలా..? సమంత కామెంట్స్!

Published : Mar 30, 2019, 04:06 PM IST
పెళ్లయ్యాక అవే సీన్లు చేస్తే ఎలా..? సమంత కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత సినిమాల పరంగా సమంతలో చాలా మార్పులు వచ్చాయి. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత సినిమాల పరంగా సమంతలో చాలా మార్పులు వచ్చాయి. కథల విషయంలో ఆమె ఆలోచన పూర్తిగా మారిపోయింది.

కమర్షియల్ సినిమాలు పక్కన పెట్టి సరికొత్త కథలను ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఏడాదికి ఒక్క సినిమా చేసినా చాలని, మంచి పాత్ర దొరకాలని అంటోంది. ఇక పెళ్లి తరువాత చైతుతో కలిసి నటించడం గురించి మాట్లాడుతూ.. సెట్ లో చైతుతో కలిసి గడపడానికి టైం దొరికిందని, ఇద్దరం కలిసి షూటింగ్ కి వెళ్లడం, ప్యాకప్ అయ్యాక ఇంటికి చేరుకోవడం బాగా అనిపించాయని వెల్లడించింది.

తెరపై భార్యాభర్తలుగా నటించడం గురించి చెబుతూ.. ''పెళ్లి తరువాత  ప్రేమలో  చాలా మార్పులు వస్తాయి. నిజానికి ఆ ప్రేమే నిజమైంది. అలాంటి కథతో ఎవరైనా సినిమా చేస్తే బాగుంటుందని కదా అనిపించేది.

అదే సమయంలో శివ ఈ సినిమా కథ తీసుకొచ్చాడు'' అంటూ వెల్లడించింది. తెరపై తను చైతుతో రొమాన్స్ చేయడం ఇదివరకే అందరూ చూసేశారని,ఇప్పుడు పెళ్లి తరువాత కూడా అలాంటి సీన్లే చేస్తే ఏం బాగుంటుందని.. అందుకే మజిలీ కథ ఎన్నుకున్నట్లు చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?