రష్మిక బ్రేకప్ పై విజయ్ దేవరకొండకి ఊహించని ప్రశ్న!

By Udayavani Dhuli  |  First Published Oct 4, 2018, 2:11 PM IST

నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన 'గీత గోవిందం' సినిమాకి ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అదే సినిమా సమయంలో రష్మిక.. రక్షిత్ తో జరిగిన నిశ్చితార్ధం రద్దు చేసుకుంది. దానికి కారణం విజయ్ దేవరకొండ అని కూడా కొన్ని ఊహాగానాలు వినిపించాయి


నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన 'గీత గోవిందం' సినిమాకి ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అదే సినిమా సమయంలో రష్మిక.. రక్షిత్ తో జరిగిన నిశ్చితార్ధం రద్దు చేసుకుంది. దానికి కారణం విజయ్ దేవరకొండ అని కూడా కొన్ని ఊహాగానాలు వినిపించాయి.

దీనికి సంబంధించి తాజాగా ఓ విలేకరి విజయ్ దేవరకొండని ప్రశ్నించాడు. 'గీత గోవిందం సినిమా నుండి లీక్ అయిన లిప్ లాక్ సీన్ కారణంగానే ఇదంతా జరిగిందని' విజయ్ ని ప్రశ్నించాడు. ఊహించని ప్రశ్నతో షాక్ తిన్నాడు విజయ్ దేవరకొండ.

Latest Videos

undefined

వెంటనే తేరుకొని.. ఈ విషయంపై తాను మాట్లాడదలచుకోవడం లేదని, ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లో జరిగిన విషయం గురించి మూడో వ్యక్తినైన తనను అడగడం కరెక్ట్ కాదని తేల్చి చెప్పాడు విజయ్.

ఇక లీక్ అయిన సీన్ వల్ల సినిమా యూనిట్ కూడా ఎంతో బాధ పడిందని సినిమాలానే నిజ జీవితం కూడా డ్రామాలా ఉంటుందని.. వాస్తవాలని అంగీకరించి ముందుకు వెళ్లడమే మనం చేయగలిగింది అంటూ ఫిలాసఫీ చెప్పుకొచ్చాడు. ఫారెన్ అమ్మాయితో డేటింగ్ విషయంపై ప్రశ్నించగా.. సమాధానమివ్వకుండా తెలివిగా తప్పించుకున్నాడు.  

ఇవి కూడా చదవండి..

టాలీవుడ్ వారసత్వంపై విజయ్ దేవరకొండ కామెంట్స్!

సినిమా రిలీజ్ ఆపడానికి చాలా చేస్తున్నారు.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు!

నోటాపై విమర్శలు.. విజయ్ దేవరకొండ సౌండ్ లేదేంటి?

రెమ్యునరేషన్ గురించి విజయ్ దేవరకొండ మాటల్లో!

'నోటా' టీఆర్ఎస్ కి సపోర్టా..?

 

click me!