ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా అనడం కరెక్ట్ కాదు.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

Published : Sep 28, 2018, 02:19 PM IST
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా అనడం కరెక్ట్ కాదు.. విజయ్ దేవరకొండ  కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసింది చిత్రబృందం. నిజానికి అక్టోబర్ 5న సినిమా విడుదల చేయడమనేది విజయ్ కి కానీ, సినిమా టీమ్ కి కానీ ఇష్టం లేదట. 

అక్టోబర్ 11న ఎన్టీఆర్ సినిమా ఉండడం, ఆ తరువాతి వారంలో రామ్ సినిమా ఉండడంతో 'నోటా'ని అక్టోబర్ 5న విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రిలీజ్ డేట్ విషయంపై విజయ్ దేవరకొండ మొదట సోషల్ మీడియాలో ఓ పోల్ నిర్వహించాడు.

ఆ సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయ్ పై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ సినిమాకి పోటీగా విడుదల చేసే ధైర్యం చేస్తావా..? అంటూ అతడిపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న విజయ్ కి ఎదురైంది.

దీనిపై స్పందించిన విజయ్.. ''తారక్ అన్న సినిమాతో నా సినిమా రిలీజ్ ని ఫ్యాన్స్ వద్దనడం కరెక్ట్ కాదు.. సినిమాలను సినిమాలుగా చూడాలి'' అని తారక్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి కామెంట్స్ చేశారు.

ఇక సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో 'ది నోటా పబ్లిక్ మీట్' పేరుతో ప్రమోషనల్ ఈవెంట్లని ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 30న విజయవాడ బెంజ్ సర్కిల్ లో, అక్టోబర్ 1న హైదరాబాద్- యూసఫ్ గూడలోని కోట్లవిజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీ ఈవెంట్ జరగనుంది. 

PREV
click me!

Recommended Stories

Psych Siddhartha Movie Review: సైక్‌ సిద్ధార్థ మూవీ రివ్యూ, రేటింగ్‌.. జెంజీ మూవీతో నందుకి హిట్‌ పడిందా?
Illu Illalu Pillalu Today Episode Jan 1: విశ్వక్‌ను ఇంట్లోంచి రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చిన ప్రేమ, చంపేస్తానంటూ వార్నింగ్