యంగ్ హీరోని బకరా చేస్తోన్న స్టార్ హీరోయిన్!

By Udayavani DhuliFirst Published Sep 28, 2018, 12:55 PM IST
Highlights

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు అవకాశాల కోసం దర్శకులని, హీరోలని కాకపడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ మాత్రం తన సహనటుడిని షాపింగ్, హోటల్స్ అంటూ తిప్పుతూ తెగ ఖర్చుపెట్టిస్తోందట. టాలీవుడ్ లో బడా నిర్మాత కొడుకైన ఓ యంగ్ హీరో మొదటి నుండి భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటిస్తున్నాడు.

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు అవకాశాల కోసం దర్శకులని, హీరోలని కాకపడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ మాత్రం తన సహనటుడిని షాపింగ్, హోటల్స్ అంటూ తిప్పుతూ తెగ ఖర్చుపెట్టిస్తోందట. టాలీవుడ్ లో బడా నిర్మాత కొడుకైన ఓ యంగ్ హీరో మొదటి నుండి భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటిస్తున్నాడు. తన సినిమాలో స్టార్ హీరోయిన్ ఉండాల్సిందే. కాస్టింగ్ కోసం భారీగా ఖర్చు చేస్తారు.

ప్రస్తుతం ఈ హీరో ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. అక్కడకి హీరో ఒంటరిగానే వెళ్లాడు. కానీ సినిమాలో నటిస్తోన్న స్టార్ హీరోయిన్ మాత్రం తన తల్లితండ్రులతో పాటు కొందరు బంధువులను కూడా వెంట బెట్టుకొని వెళ్లిందట.

ఈ హీరోయిన్ పై ఇంటరెస్ట్ చూపిస్తోన్న సదరు కుర్ర హీరో తనతో పాటు కుటుంబాన్ని కూడా కాకపట్టడం కోసం వారిని హోటల్స్ కి, షాపింగ్ కి తీసుకువెళ్తున్నాడట. అతడి ఇంటెన్షన్ తెలుసుకున్న హీరోయిన్ స్మార్ట్ గా అతడితో ఖర్చులన్నీ పెట్టిస్తుందట.

ఇప్పటికే హీరో అకౌంట్ నుండి లక్షలు లక్షలు డెబిట్ అయ్యాయని సమాచారం. ఈ రిలేషన్ అదనుగా తీసుకుందామని హీరో భావించినా హీరోయిన్ మాత్రం అంత ఛాన్స్ ఇవ్వదని అక్కడ జనాలు మాట్లాడుకుంటున్నారు! 

click me!