మీ పార్టీ నాకు ఓకే.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

Published : Dec 17, 2018, 10:01 AM IST
మీ పార్టీ నాకు ఓకే.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

సారాంశం

గూగుల్ లో నెటిజన్లు అత్యధికంగా వెతికిన దక్షిణాది సెలబ్రిటీల జాబితాలో విజయ్ దేవరకొండకి చోటు దక్కింది. ఈ లిస్టులో విజయ్ కి నాలుగో స్థానం దక్కగా, విజయ్-రష్మిక నటించిన 'గీత గోవిందం' సినిమా అత్యధికంగా వెతికిన చిత్రంగా నిలిచింది. 

ఈ సందర్భంగా విజయ్ ని పార్టీ అడిగింది రష్మిక. అలానే రష్మికని పార్టీ అడిగాడు విజయ్. ఇలా వీరిద్దరూ నువ్వు పార్టీ ఇవ్వాలంటే నువ్వు ఇవ్వాలి అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేసుకున్నారు.

దీంతో వీరి మధ్యలోకి ఎంటర్ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు.. ''వెయిట్ వెయిట్ వెయిట్ పార్టీ జరుగుతుంది. డియర్ కామ్రేడ్స్.. మీరు ఇంటి నుంచి వచ్చేసి నెల రోజులుగా చాలా కష్టపడి పని చేస్తున్నారు. మీ పనితనం చూస్తే మాకు ముచ్చటేస్తుంది. కంగ్రాట్స్ కానీ.. పార్టీ మాది'' అని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై స్పందించిన విజయ్ దేవరకొండ ''నాకు ఇప్పుడు 'బి'తో మొదలయ్యే పదం చెప్పాలని ఉంది కానీ చెప్పట్లేదు.. కానీ మీ పార్టీని అంగీకరిస్తున్నా'' అంటూ రిప్లై చేశాడు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న 'డియర్ కామ్రేడ్' సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 

ఎలక్షన్స్ తర్వాత పార్టీ అన్నావ్.. ఏది విజయ్?: రష్మిక 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌