అది విని మానసికంగా కుంగిపోయా: ఇలియానా!

Published : Dec 17, 2018, 09:34 AM IST
అది విని మానసికంగా కుంగిపోయా: ఇలియానా!

సారాంశం

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ కూడా సక్సెస్ లు రాకపోవడంతో తిరిగి మళ్లీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది. 

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ కూడా సక్సెస్ లు రాకపోవడంతో తిరిగి మళ్లీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది. కానీ తన రీఎంట్రీలో సరైన సక్సెస్ అందుకోలేక డీలా పడింది.

ఇది ఇలా ఉండగా.. ఇటీవల ఓ ప్రశ్న ఆమెను బాగా ఇబ్బంది పెట్టిందట. అదేంటంటే.. మీరు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారంట కదా..? ఈ ప్రశ్న ఇలియానాని ఎంతగానో బాధ పెట్టిందని చెబుతోంది.

ఆమె మాట్లాడుతూ.. ''ఇలాంటి పుకార్లు విన్నప్పుడే చెప్పలేనంత బాధ కలుగుతుంది. మానసికంగా చాలా కుంగిపోయాను. వారం రోజుల పాటు బయటకి వెళ్లాలనిపించలేదు. ఎవరితో మాట్లాడాలని కానీ, కలవాలని కానీ అనిపించలేదు. ఇంటినే పరిమితమయ్యాను.

నెమ్మదిగా ఆ స్థితి నుండి నార్మల్ అయ్యాను. అవి గాలి వార్తలని తెలిసినా ఎంతోకొంత ప్రభావం అయితే మనసు మీద చూపుతుంది. నాకు అలానే జరిగింది. ఇప్పుడంతా సర్దుకుంది'' అంటూ వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం