మాట నిలబెట్టుకున్న విజయ్‌ దేవరకొండ.. వంద మందికి సాయం.. లిస్ట్ ఇదే

Published : Jan 08, 2022, 05:04 PM ISTUpdated : Jan 08, 2022, 05:11 PM IST
మాట నిలబెట్టుకున్న విజయ్‌ దేవరకొండ.. వంద మందికి సాయం.. లిస్ట్ ఇదే

సారాంశం

క్రిస్మస్‌ సందర్భంగా తాను మిలియనీర్‌ అయ్యానని, ఇప్పుడు హెల్ప్ చేసే సమయం వచ్చిందని చెప్పి, వంద మందిని ఎంపిక చేసి వారికి పది వేల రూపాయలు క్రిస్మస్‌ గిఫ్ట్ గా అందిస్తానని తెలిపారు విజయ్‌ దేవరకొండ.

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) తాను మిలియనీర్‌ అయితే సాయం చేస్తానని కెరీర్‌ బిగినింగ్‌లో భావించారు. ఇప్పుడు ఆయన మిలియనీర్‌గా మారిపోయింది. దీంతో తనవంతు సాయం చేసేందుకు సిద్ధమయ్యాడు Vijay Deverakonda. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో అవసరంలో ఉన్న పేద, మధ్యతరగతి వారికి సాయం చేస్తానని ప్రకటించారు. తనవంతు సాయాన్ని అందించింది. వినూత్నంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. తను కొంత అమౌంట్‌ విరాళంగా ఇవ్వడంతోపాటు, మరికొంత విరాళాలు సేకరించి ఈ సహాయాన్ని అందించారు. 

ఇప్పుడు క్రిస్మస్‌ సందర్భంగా తాను మిలియనీర్‌ అయ్యానని, ఇప్పుడు హెల్ప్ చేసే సమయం వచ్చిందని చెప్పి, వంద మందిని ఎంపిక చేసి వారికి పది వేల రూపాయలు క్రిస్మస్‌ గిఫ్ట్ గా అందిస్తానని తెలిపారు. `దేవరశాంటా` పేరుతో 100మందికి పది వేల రూపాయల చొప్పున క్రిస్మస్‌ గిఫ్ట్ ఇస్తానని ప్రకటన చేసిన నేపథ్యంలో దానికి అనూహ్య స్పందన లభించింది. దేవరశాంటా 2021 యాష్ ట్యాగ్ కు అత్యధిక సంఖ్యలో రిక్వెస్టులు వచ్చాయి. వాటిలో నుంచి 100 మందిని ఎంపిక చేశారు. ఈ 100 మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున అందించనున్నారు. 

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా స్పందించారు. `మై లవ్స్ దేవరశాంటా విజేతల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి. త్వరలో మా టీమ్ మిమ్మల్ని సంప్రదించి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తుంది` అని ట్వీట్ లో పేర్కొన్నారు విజయ్‌ దేవరకొండ. తను స్టార్ అయినప్పటి నుంచి దేవరశాంటా పేరుతో క్రిస్మస్ కు బహుమతులు ఇస్తున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఈ ఏడాది కూడా ఆయన నగదు రూపంలో బహుమతులు ప్రకటించారు. ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున 100 మందికి 10 లక్షల రూపాయలు బహుమతిగా పంచుతున్నారు. విజయ్‌ చేస్తున్న ఈ కార్యక్రమానికి విశేష ప్రశంసలు దక్కడం విశేషం. 

ఇక విజయ్‌ దేవరకొండ ఫస్ట్ టైమ్ పాన్‌ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. `లైగర్‌` పేరుతో  ఈ చిత్రం రూపొందుతుంది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై తెలుగు, హిందీలో పాన్‌ ఇండియా చిత్రంగా పూరీ జగన్నాథ్‌, చార్మి, కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇది భారీ వ్యూస్‌ని దక్కించుకుంది. ఇందులో బాక్సర్‌గా విజయ్‌ దేవరకొండ కనిపించబోతున్నారు.  ఆయనకు జోడీగా బాలీవుడ్‌ నటి అనన్య పాండే నటిస్తుంది. ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదల కాబోతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు
Balakrishna: వెంకటేష్‌ కోసం తన 50 ఏళ్ల సెంటిమెంట్‌ని పక్కన పెట్టిన బాలయ్య.. చిరు, నాగ్‌ల కోసం ఇలా చేయలేదు