కేక్‌ పీస్‌తో కంగనా భయంకర పోజ్‌.. కోవిడ్‌ రూల్స్ వర్తించవా.. నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్‌..

Published : Jan 08, 2022, 04:13 PM IST
కేక్‌ పీస్‌తో కంగనా భయంకర పోజ్‌.. కోవిడ్‌ రూల్స్ వర్తించవా.. నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్‌..

సారాంశం

కంగనా రనౌత్‌ పోజులిచ్చిన ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. ఇందులో ఆమె హోటల్‌లో కేక్‌ పీస్‌ని తింటున్నట్టుగా పోజులిచ్చింది. సడెన్‌గా సర్వింగ్‌ బాయ్‌ వద్ద నుంచి కేక్‌ పీస్‌ తీసుకుని నోటి వద్ద పెట్టుకుని ఫోటోలకు పోజులిచ్చింది.

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆమె నిత్యం పలు వివాదాస్పద కామెంట్లు చేస్తూ వివాదాలకు కేరాఫ్‌ నిలుస్తున్న విషయం తెలిసిందే. బోల్డ్ గా తనకు ఏదనిపిస్తే అది మాట్లాడుతూ సంచలనాలు క్రియేట్‌ చేస్తుంది. అవి చాలా వరకు కాంట్రవర్సీలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కంగనా రనౌత్‌ చేసిన పని మరింత వివాదంగా మారింది. దీంతో నెటిజన్లు సోషల్‌ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. కంగనాకి కోవిడ్‌ రూల్స్ వర్తించవా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

కంగనా రనౌత్‌ పోజులిచ్చిన ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. ఇందులో ఆమె హోటల్‌లో కేక్‌ పీస్‌ని తింటున్నట్టుగా పోజులిచ్చింది. సడెన్‌గా సర్వింగ్‌ బాయ్‌ వద్ద నుంచి కేక్‌ పీస్‌ తీసుకుని నోటి వద్ద పెట్టుకుని ఫోటోలకు పోజులిచ్చింది. ఫోటోలు తీసిన తర్వాత ఆ పీస్‌ని మళ్లీ ప్లేట్‌లో పెట్టేసింది. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. కంగనా చేష్టలు చూసి నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. కరోనా కారణంగా ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరవుతుంది. కానీ అవేమీ పట్టించుకోకండా ఇలాంటి పోజులేంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. వైరస్‌ ని అంటించాలని బలంగా ఫిక్స్ అయినట్టుందని ట్రోల్స్ చేస్తున్నారు. కంగనాని నిలదీస్తున్నారు.

 దీంతో ఇప్పుడు కంగనా రనౌత్‌ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది.  ఛాన్స్ దొరికడంతో చాలా మంది నెటిజన్లు కంగనాని టార్గెట్‌ చేసి మరీ కామెంట్లు చేయడం, రకరకాలుగా మీమ్స్ చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు. కంగనాని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన కంగనా ఈ వీడియో, కేక్‌ తింటున్న పిక్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి. కంగనా రనౌత్‌ గతంలో మహత్మా గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశానికి అసలైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందంటూ ఆ మధ్య కామెంట్ చేసి వివాదాలకు నెలవుగా మారింది. మరోవైపు సిక్కులను ఉగ్రవాదులుగా పోల్చడం, రైతులు చేస్తున్న ఉద్యమంపై తప్పుడు కామెంట్లు చేయడం వివాదంగా మారాయి. 

ఇక కెరీర్‌ పరంగా చూస్తే కంగనా రనౌత్‌ చివరగా `తలైవి` చిత్రంలో మెరిసింది. ఇందులో ఆమె అలనాటి నటి, మాజీ సీఎం జయలలిత పాత్రలో నటించి మెప్పించింది. పాత్రకి ప్రాణం పోసింది. మరోవైపు `తేజాస్‌`, `మణికర్ణిక రిటర్న్స్`, `ఎమర్జెన్సీ`, `ధాఖడ్‌`, `ది ఇంకర్‌నేషన్‌ః సీత` చిత్రాల్లో నటిస్తూ బిజీగాఉంది. వీటితోపాటు `టీకు వెడ్స్ షేరు` చిత్రాన్ని నిర్మిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Rajamouli కి పోటీగా.. 1000 కోట్లతో శంకర్ సినిమా, ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? హీరో ఎవరు?
Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్