Pawan Kalyan:'భవదీయుడు భగత్ సింగ్' అప్డేట్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 08, 2022, 04:02 PM IST
Pawan Kalyan:'భవదీయుడు భగత్ సింగ్' అప్డేట్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'. ఎందుకంటే ఈ చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరచడు అని వారంతా హోప్స్ పెట్టుకుని ఉన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'. ఎందుకంటే ఈ చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరచడు అని వారంతా హోప్స్ పెట్టుకుని ఉన్నారు. ఈసారి గబ్బర్ సింగ్ ని మించేలా కంటెంట్ తో రావాలని కోరుకుంటున్నారు. 

భీమ్లా నాయక్ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. అలాగే హరిహర వీరమల్లు షూటింగ్ ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఆ తర్వాతే భవదీయుడు భగత్ సింగ్ మూవీ పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేవిశ్రీ పవన్ మూవీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

పవన్, దేవిశ్రీ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కాంబోలో జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. దేవిశ్రీ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి ఆల్రెడీ మ్యూజిక్ వర్క్ స్టార్ అయ్యింది. రెండు సాంగ్స్ కూడా కంపోజ్ చేశాను. ఈ చిత్రంలోని పాటలు ఎనెర్జిటిక్ గా, మెలోడియస్ గా ఉండబోతున్నాయి అని తెలిపాడు. 

షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని దేవిశ్రీ తెలిపారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయని తెలుసు. తప్పకుండా అంచనాలు అందుకుంటాం అని దేవిశ్రీ చెప్పుకొచ్చాడు. 

భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. గత ఏడాది ఫస్ట్ లుక్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajamouli కి పోటీగా.. 1000 కోట్లతో శంకర్ సినిమా, ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? హీరో ఎవరు?
Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్