జరిగింది చాలు.. ఇక పెళ్లిళ్లకు రాలేను: విజయ్

Published : Sep 26, 2018, 08:32 PM IST
జరిగింది చాలు.. ఇక పెళ్లిళ్లకు రాలేను: విజయ్

సారాంశం

అభిమాన హీరో సమీప ప్రాంతానికి వస్తున్నాడు అంటే చాలు ఎందుకు వస్తున్నాడు? ఎలా వస్తున్నాడు? అని తెలుసుకోకుండా అభిమానులు వెంటనే చూడటానికి వెళ్ళిపోతారు. సెల్ఫీల కోసం తెగ ఎగబడిపోతారు. రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు అలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది. దీంతో ఒక పెళ్లి వేడుకలో ఇబ్బందులు తలెత్తాయి. 

ఇక విజయ్ పరిస్థితి గురించి తెలుసుకొని మరోసారి ఎలాంటి పెళ్లి వేడుకకు రానని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇటీవల తన అభిమాన సంఘం కార్యదర్శి ఆనంద్ కూతురి పెళ్లి వేడుకకు విజయ్ సతిమేతంగా వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా ఫంక్షన్ హాల్ కి వేల సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. పెళ్లిలో చాలా వరకు కుర్చీలు ధ్వంసమయ్యాయి. పెళ్లికి వచ్చిన అతిధులు కనీసం భోజనం కూడా చేయలేని పరిస్థితి. 

తన కారణంగా పెళ్లి వేడుకలో ఇలాంటి పరిస్థితి రావడంతో విజయ్ మరోసారి ఏ పెళ్లి వేడుకకు వెళ్లబోనని క్లారిటీ ఇచ్చేశాడు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని విజయ్ చెప్పాడు. అదే విధంగా అవసరం అయితే వధూవరులను ఇంటికి పిలిపించి స్పెషల్ గా విష్ చేస్తానని విజయ్ ఇచ్చిన వివరణ అందరిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ హీరో మురగదాస్ దర్శకత్వంలో సర్కార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.    

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే