మరో యంగ్ హీరోని టార్గెట్ చేసిన గీత ఆర్ట్స్?

By Prashanth MFirst Published Sep 26, 2018, 8:00 PM IST
Highlights

చిన్న చిత్రాలను నిర్మించి ఎక్కువ మొత్తంలో షేర్స్ అందుకోవడం బెటర్ అని లెక్కలు వేసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన గీత గోవిందం  మంచి లాభాలను అందించిన సంగతి తెలిసిందే.  అదే తరహాలో మరికొన్ని చిత్రాలను నిర్మించడానికి గీత ఆర్ట్స్ రెడీ అవుతోంది. 

టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా పేరున్న గీత ఆర్ట్స్ ఇటీవల కాలంలో టాలెంట్ ఉన్న దర్శకులను నటీనటులకు ఎక్కువగా అవకాశాలు కల్పిస్తోంది. పెద్ద సినిమాలు నిర్మించి కొద్దీ పాటి లాభాలతో సతమతమయ్యే కన్నా  చిన్న చిత్రాలను నిర్మించి ఎక్కువ మొత్తంలో షేర్స్ అందుకోవడం బెటర్ అని లెక్కలు వేసుకుంటున్నారు. 

ఇటీవల విడుదలైన గీత గోవిందం  మంచి లాభాలను అందించిన సంగతి తెలిసిందే. ఇకపోతే అదే తరహాలో మరికొన్ని చిత్రాలను నిర్మించడానికి గీత ఆర్ట్స్ రెడీ అవుతోంది. అందులో భాగంగానే ఛలో సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ అందుకున్న నాగ శౌర్యతో ఒక ప్రాజెక్టు కు డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఒక టాలెంటెడ్ డైరెక్టర్ స్క్రిప్ట్ కూడా ఫైనల్ చేసినట్లు టాక్. 

ప్రస్తుతం నాగశౌర్య కొత్త దర్శకులతో చేస్తున్న రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఛలో సినిమాతో మంచి హిట్ అందుకున్నప్పటి రీసెంట్ గా వచ్చిన నర్తన శాల సినిమాతో మళ్ళీ డిజాస్టర్ అందుకున్నాడు. త్వరలో గీత ఆర్ట్స్ లో చేయబోయే ప్రాజెక్టు గురించి అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

 

click me!