అమిర్ ఖాన్ - అమితాబ్.. తెలుగులో డబ్బింగ్ చెప్పేస్తారా.. ఏంటి?

By Prashanth MFirst Published Sep 26, 2018, 7:26 PM IST
Highlights

బాహుబలి ఇచ్చిన దెబ్బకు తెలుగులో కూడా వందల కోట్ల మార్కెట్ ఉందని బాలీవుడ్ ప్రముఖులు ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే వారి సినిమాలను తెలుగులో కూడా అనువదించడానికి సిద్దపడుతున్నారు. 

బాహుబలి తరువాత ఇండియన్ సిల్వర్ స్క్రీన్ లో చాలా వరకు లెక్కలు మారాయి. అంతకుముందు కేవలం బాలీవుడ్ సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దన్న పాత్ర పోషించేవి. కానీ బాహుబలి ఇచ్చిన దెబ్బకు తెలుగులో కూడా వందల కోట్ల మార్కెట్ ఉందని బాలీవుడ్ ప్రముఖులు ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే వారి సినిమాలను తెలుగులో కూడా అనువదించడానికి సిద్దపడుతున్నారు. 

అమిర్ ఖాన్ సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. అందుకే తెలుగులో కూడా రిలీజ్ చేస్తే సినిమా బిజినెస్ పెరిగే అవకాశం ఉందని ఆయన నెక్స్ట్ సినిమా 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ని డబ్ చేస్తున్నారు. దీపావళికి హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు యష్ రాజ్ ఫిలిమ్స్ సిద్దమయ్యింది. ఇక అందరిని ఆకర్షించే విధంగా చిత్ర కథానాయకులైన అమిర్ ఖాన్ - అమితాబ్ బచ్చన్ తో తెలుగులో మాట్లాడించారు. అందుకు సంబందించిన వీడియోను రీసెంట్ గా రిలీజ్ చేశారు. 

కాస్త తడబడినప్పటికీ తెలుగు బాగానే మాట్లాడి టాలీవుడ్ ని ఆకర్షించారు. దీపావళికి థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ని మీతో షేర్ చేసుకుందాం అన్నారు. ఇద్దరి పేర్లు కూడా తెలుగు అభిమానులకు తెలిసినప్పటికీ వారి స్టైల్ లో తెలుగులో మాట్లాడి పరిచయం చేసుకున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా వారు మాట్లాడిన విధానానికి ఫిదా అవుతున్నారు. మొత్తానికి బాలీవుడ్ తెలుగు ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తోందని అర్ధమయ్యింది. దీంతో భవిష్యత్తులో డబ్బింగ్ కూడా చెప్పేస్తారా ఏంటి? అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.   

 

 

click me!