ఆస్కార్‌ అవార్డు కమిటీలో విద్యా బాలన్‌, ఏక్తా కపూర్‌ , శోభా కపూర్‌

Published : Jul 02, 2021, 06:37 PM IST
ఆస్కార్‌ అవార్డు కమిటీలో విద్యా బాలన్‌, ఏక్తా కపూర్‌ , శోభా కపూర్‌

సారాంశం

అత్యంత ప్రతిష్టాత్మక పురస్కార కమిటీలో ఇండియన్స్ కి చోటు దక్కింది. బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌కి, నిర్మాతలు ఏక్తా కపూర్‌, తల్లి శోభా కపూర్‌లు సభ్యులుగా ఎంపికయ్యారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సినీ అవార్డు ఏదైనా ఉందంటే అది ఆస్కార్‌ పురస్కారం. ఆస్కార్‌ వస్తే ఇక సినీ కెరీర్‌లో ఆ విభాగంలో తను టాప్‌లెవల్‌ టాలెంట్‌గా భావిస్తారు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక పురస్కార కమిటీలో ఇండియన్స్ కి చోటు దక్కింది. బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌కి, నిర్మాతలు ఏక్తా కపూర్‌, తల్లి శోభా కపూర్‌లు వచ్చే ఏడాది అందించే అవార్డులకు సంబంధించిన `ది క్లాస్‌ ఆఫ్‌ 2021` లో సభ్యులుగా స్థానం దక్కింది. 

నటుల కేటగిరిలో విద్యాబాలన్‌కి, నిర్మాతల విభాగంలో ఏక్తా కపూర్‌, శోభాకపూర్‌లకు చోటు దక్కింది. మొత్తం యాభై దేశాలకు చెందిన 395 మంది ఇందులో సభ్యులున్నారు. వారిలో 46శాతం మంది మహిళలకు చోటు కల్పించారు. వారిలో ఇండియాకి చెందిన ఇద్దరుండటం విశేషం. వీరంతా ఆయా విభాగాల్లో ఆస్కార్‌ అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యులుగా ఉంటారు. `తుమ్హారి సులు`,  `కహాని` చిత్రాలను పరిగణలోకి తీసుకుని విద్యా బాలన్‌ని,  `డ్రీమ్‌ గర్ల్`,`వన్స్ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబయి` చిత్రాలను పరిగణలోకి తీసుకుని ఏక్తా కపూర్‌ని, `ఉడ్తా పంజాబ్‌`, `ది డర్టీ పిక్చర్` చిత్రాలను పరిగణలోకి తీసుకుని శోభా కపూర్‌లను ఎంపిక చేశారు. వీరు ఆస్కార్‌ అవార్డుల సమయంలో ఓట్లు వేసే హక్కుని పొందుతారు. జ్యూరీ ఎంపికలో వీరిది కీలక పాత్ర కానుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?