వెండితెర మదర్‌కి హైదరాబాద్‌ స్వీట్స్ తో సర్‌ప్రైజ్‌ చేసిన ప్రభాస్‌

Published : Jul 02, 2021, 04:56 PM IST
వెండితెర మదర్‌కి హైదరాబాద్‌ స్వీట్స్ తో సర్‌ప్రైజ్‌ చేసిన ప్రభాస్‌

సారాంశం

ప్రభాస్‌ సీనియర్‌ నటి భాగ్యశ్రీని సర్‌ప్రైజ్‌ చేశారు. తెలుగు రుచులు చూపించారు. ఆమెకి హైదరాబాదీ స్వీట్లని గిఫ్ట్ గా పంపించి మనసుని దోచుకున్నాడు.

ప్రభాస్‌ సీనియర్‌ నటి భాగ్యశ్రీని సర్‌ప్రైజ్‌ చేశారు. తెలుగు రుచులు చూపించారు. ఆమెకి హైదరాబాదీ స్వీట్లని గిఫ్ట్ గా పంపించి మనసుని దోచుకున్నాడు. ప్రభాస్‌, సీనియర్‌ నటి భాగ్య శ్రీ కలిసి `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో భాగ్య శ్రీ ప్రభాస్‌కి తల్లి పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఈ విషయాన్ని భాగ్యశ్రీ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆయనతో వర్క్ ఎక్స్ పీరియెన్స్ ని షేర్‌ చేసుకుంది. అంతేకాదు షూటింగ్‌ సెట్‌లో ప్రభాస్‌ తన ఇంటి నుంచి ప్రత్యేకంగా వండించిన వంటకాలను రుచి చూపించినట్టు తెలిపింది భాగ్యశ్రీ. 

తాజాగా పూతరేకులు భాగ్యశ్రీకి గిఫ్ట్ గా పంపించాడట. ఈ విషయాన్ని తెలియజేస్తూ భాగ్యశ్రీ ట్వీట్‌ చేసింది. `ఎంతో రుచికరమైన, కమ్మనైన హైదరాబాదీ స్వీట్లు అందాయి. థ్యాంక్స్ ప్రభాస్‌. మొత్తానికి నా అభిరుచినే మార్చేశావు` అని ట్వీట్‌ చేసింది. ఆ స్వీట్ల ప్యాకెట్లని ఫోటో తీసి పంచుకుంది. దీంతో ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న `రాధేశ్యామ్‌`లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇందులో విక్రమాదిత్య అనే పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్నారు. ఈ సినిమా కరోనా అనంతరం మళ్లీ షూటింగ్‌ ప్రారంభించుకుంది. దసరాకి దీన్ని రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు