అంతరిక్షంలోకి `బండ్ల` ఫ్యామిలీ.. బండ్ల గణేష్‌ సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా!

By Aithagoni RajuFirst Published Jul 2, 2021, 4:11 PM IST
Highlights

 తెలుగు మూలాలున్న మహిళ శిరీష బండ్ల అంతరిక్షంలోకి ప్రయాణించనున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్‌ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. 

తెలుగు మూలాలున్న మహిళ శిరీష బండ్ల అంతరిక్షంలోకి ప్రయాణించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 11న అమెరికాకి చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అంతరిక్ష వాహక నౌకని ప్రయోగించనుంది. ఇందులో ప్రయాణించబోతున్న నలుగురులో ఒకరు శిరీష బండ్ల కావడం విశేషం. ఆమె వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్వహరాల ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్షయానం చేయనున్నారు. దీంతో ఇప్పుడు భారతీయులు గర్వపడే సందర్భం వచ్చింది. ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు మరింత గర్వంగా చెప్పుకోవాల్సిన సందర్భం. 

ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్‌ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. తమ ఫ్యామిలీ అంతరిక్షంలోకి వెళ్తున్న నేపథ్యంలో బండ్ల గణేష్‌ పెట్టిన అదిరిపోయే ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.  శిరీష బండ్ల అంతరిక్షయానానికి సంబంధించిన `ఏషియానెట్‌ తెలుగు` కథనాన్ని ట్యాగ్‌ చేస్తూ నిర్మాత బండ్ల గణేష్‌ ట్వీట్‌ చేశారు. `మా బండ్ల ఫ్యామిలీ మరో ఘనతని సాధించిందని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది` అని పేర్కొన్నాడు బండ్ల గణేష్‌. అంతేకాదు వీటికి సంబంధించిన అనేక కథనాలను ఆయన ట్వీట్‌ చేస్తున్నారు. దీంతో ఆయన ఏ రేంజ్‌లో సెలబ్రేట్‌ చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

We are proud to say our Bandla family achieving one More Goal 👌👌👌👌 https://t.co/25GnhwdY3o

— BANDLA GANESH. (@ganeshbandla)

అయితే ఇది కొత్త చర్చకు దారి తీస్తుంది. శిరీష బండ్ల.. బండ్ల గణేష్‌ సిస్టర్‌ ? అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ఆమెతో తమకి ఎలాంటి ఫ్యామిలీ రిలేషన్‌ ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజంగానే ఆమె వీరి ఫ్యామిలీ రిలేటివా? లేక బండ్ల అనే ఇంటి పేరు కారణంగా గణేష్‌ అలా అన్నారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. కానీ బండ్ల గణేష్‌ ట్వీట్స్ మాత్రం వైరల్‌ అవుతున్నాయి. దీనిపై బండ్లగణేషే క్లారిటీ ఇవ్వాలి. ఇక బండ్ల శిరీష ఫ్యామిలీది ఏపీలోని గుంటూరు జిల్లా. డా. అనురాధ, డాక్టర్ మురళీధర్‌రావు వీరి తల్లిదండ్రలు. చాలా ఏళ్ల క్రితమే ఈ కుటుంబం అమెరికాలోని స్థిరపడింది.

 చిన్నతనం నుంచి అంతరిక్ష యానమంటే శిరీషకి ఇష్టం. పురుడే యూనివర్శిటీ నుంచి ఆమె ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. జార్జి వాషింగ్టన్‌ యూనివర్శిటీలో ఆమె ఏంబీఏ చేశారు. గత 13ఏళ్లుగా ఏరోస్పేస్‌ విభాగంలో పనిచేస్తున్నారు. 

click me!