విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ లో వివాదాలకు దూరంగా ఉండే కొద్దిమంది హీరోల్లో ఒకరు. వెంకీ సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం జనవరి 14న రిలీజ్ అవుతోంది.
విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ లో వివాదాలకు దూరంగా ఉండే కొద్దిమంది హీరోల్లో ఒకరు. వెంకీ సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం జనవరి 14న రిలీజ్ అవుతోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి యమా క్రేజీగా ప్రమోషన్స్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
ఒకప్పుడు తన మ్యూజిక్ తో యువతని ఉర్రూతలూగించిన రమణగోకుల ఈ చిత్రంలో ' గోదారి గట్టు'అనే సాంగ్ పాడాడు. ఈ సాంగ్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో సంచలనం సృష్టిస్తోంది. మీను అనే మరో పాట కూడా వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ స్వయంగా ఒక పాట పాడారు. ఆ సాంగ్ ని త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇలా ఆసక్తి పెంచేలా సంక్రాంతికి వస్తున్నాం చిత్ర ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి.
రీసెంట్ గా వెంకటేష్.. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి అతిథిగా హాజరయ్యారు. బాలయ్య, వెంకటేష్ ఇద్దరూ భలే సరదాగా సందడి చేశారు. అనేక విషయాలు మాట్లాడుకున్నారు. బాలయ్య అడిగిన ప్రశ్నలకు వెంకీ సరదాగా సమాధానాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో స్నేహం గురించి వెంకటేష్ ని బాలయ్య ప్రశ్నించారు.
దీని గురించి వెంకీ మాట్లాడుతూ.. పవన్, నేను సినిమాల వల్ల స్నేహితులం కాలేదు. పవన్ సినిమాల్లోకి రాకముందు నుంచే మా ఇంటికి తరచుగా వచ్చేవాడు. ఆ టైంలో నేను లేజర్ డిస్క్ లని కలెక్ట్ చేసి దాచుకునే వాడిని. వాటిలో కొన్నింటిని పవన్ కి ఇస్తూ ఉండేవాడిని. అలా మా మధ్య స్నేహం పెరిగింది. ఆ తర్వాత ఆధ్యాత్మిక అంశాల గురించి ఎక్కువగా మాట్లాడుకొవడం ప్రారంభించాం. దాని వల్ల కూడా రిలేషన్ పెరిగింది అని వెంకీ అన్నారు. బాలయ్య వెంటనే.. అవును పవన్ అమ్మవారి భక్తుడు కదా అని అన్నారు. పవన్ కళ్యాణ్ చాలా కాలంగా వారాహి అమ్మవారిని భక్తిశ్రద్దలతో పూజిస్తున్నారు.
పవన్ ఎక్కువగా సైలెంట్ గా ఉంటాడు అని వెంకటేష్ అన్నారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి గోపాల గోపాల చిత్రంలో నటించారు. ఈ మూవీలో పవన్ శ్రీకృష్ణడిగా నటించిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి చిత్రంలో వెంకీ చిన్న కామియో రోల్ లో మెరిశారు.
గోపాల గోపాల చిత్రం హిందీలో ఓ మై గాడ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. వెంకటేష్ చివరగా సైంధవ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో వెంకీ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అనిల్ రావిపూడి, వెంకటేష్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో సంక్రాంతి వస్తున్నాం చిత్రం తెరకెక్కింది. ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. అవి రెండూ మల్టీ స్టారర్ చిత్రాలు. తొలిసారి సోలోగా వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం ఇది. ఒక వైపు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నప్పటికీ అనిల్ రావిపూడి, వెంకటేష్ తగ్గడం లేదు.
ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకంటే సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికే మంచి బజ్ ఉందని నెటిజన్లు అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ చిత్రం పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో వెంకటేష్ తో తొలిసారి మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఇక బాలయ్య, వెంకటేష్ ఇద్దరూ మూడు సార్లు సంక్రాంతికి పోటీ పడ్డారు. 2000 సంవత్సరం సంక్రాంతికి బాలయ్య వంశోద్ధారకుడు, వెంకటేష్ కలిసుందాం రా చిత్రాలు విడుదలయ్యాయి. 2001 సంక్రాంతికి బాలయ్య నరసింహ నాయుడు చిత్రంతో వచ్చారు. వెంకటేష్ దేవి పుత్రుడు చిత్రం కూడా రిలీజ్ అయింది. 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎఫ్ 2 చిత్రాలు విడుదలయ్యాయి. ఇప్పుడు నాలుగోసారి బాలయ్య, వెంకీ సంక్రాంతి వార్ లో నిలిచారు.