సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ ని గట్టిగా వాడేస్తున్న అనిల్ రావిపూడి!

By Sambi Reddy  |  First Published Dec 28, 2024, 10:03 PM IST

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్ సరికొత్తగా రూపొందిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆడియన్స్ ని ఆకర్షించేలా ప్రణాళికలు వేస్తున్నాడు. దీనిలో భాగంగా వెంకటేష్ ని గట్టిగా వాడేస్తున్నాడు.. 
 


విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం సైంధవ్‌ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. యాక్షన్ క్రైమ్ డ్రామాగా సైంధవ్‌ తెరకెక్కింది. హిట్, హిట్ 2 చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించాడు. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం తీవ్ర నిరాశపరిచింది. నా సామిరంగ, గుంటూరు కారం పర్లేదు అనిపించాయి. సైంధవ్‌ మాత్రం డిజాస్టర్ అయ్యింది. అనూహ్యంగా బడా హీరోలకు షాక్ ఇస్తూ తేజ సజ్జా సంక్రాంతి విన్నర్ అయ్యాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ బ్లాక్ బస్టర్ కొట్టింది. 

దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న వెంకటేష్ మళ్ళీ సంక్రాంతి రేసులో నిలిచాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో నటించారు.  అనిల్ రావిపూడి-వెంకీలది హిట్ కాంబినేషన్. ఫస్ట్ టైం ఎఫ్ 2 కోసం చేతులు కలిపారు. వరుణ్ తేజ్ మరో హీరోగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా ఎఫ్ 2 బ్లాక్ బస్టర్. 2019 సంక్రాంతి విన్నర్. ఆ ఏడాది విడుదలైన వినయ విధేయ రామ, ఎన్టీఆర్: కథానాయకుడు డిజాస్టర్ అయ్యాయి. దిల్ రాజుకు ఎఫ్ 2 కాసుల వర్షం కురిపించింది. 

Latest Videos

undefined

వీరి కాంబోలో వచ్చిన రెండో చిత్రం ఎఫ్ 3. ఇది పర్లేదు అనిపించుకుంది. ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముచ్చటగా మూడోసారి వెంకీ-అనిల్ రావిపూడి... సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సంక్రాంతి వస్తున్నాం.. విలేజ్ ఫ్యామిలీ డ్రామా. వెంకటేష్ భార్యగా ఐశ్యర్య రాజేష్ నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఇది పక్కా సంక్రాంతి చిత్రం అనే భావన కలుగుతుంది. 

వంద పాముల మధ్య వెంకటేష్ వణుకుతూ చేసిన సీన్ ఏదో తెలుసా..?

సంక్రాంతికి వస్తున్నాం నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్ ''గోదారి గట్టు మీద రామ చిలకవే'' ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. రమణ గోగులను వెతికి మరీ తెచ్చాడు అనిల్ రావిపూడి. ఆయన అంచనాలకు మించి  రమణ గోగుల సాంగ్ పెర్ఫార్మ్ చేస్తుంది. రమణ గోగుల సాంగ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భారీ ప్రచారం తెచ్చిపెట్టింది. సాంగ్స్ విడుదలకు ముందు చిన్న డ్రామాతో కూడిన వీడియోలు అనిల్ రావిపూడి విడుదల చేస్తున్నారు. 

కాగా మూడో సాంగ్  విడుదలకు అనిల్ రావిపూడి రూపొందించిన ప్రమోషనల్ వీడియో వినూత్నంగా ఉంది. మూడో సాంగ్ స్టార్ సింగర్ తో పాడించాలని అనిల్ రావిపూడి ఆశపడ్డాడు. కానీ వెంకటేష్ ఆ సాంగ్ నేను పాడతా అని పట్టుబట్టాడు. పదే పదే అడుగుతూ విసిగించేశాడు. చేసేది లేక ఓకే చెప్పాడు. ప్రచారంలో భాగంగా రూపొందించిన ఈ డ్రామా చాలా కామెడీగా ఉంది. ఇక వెంకీ పాడిన సాంగ్ ప్రోమో వచ్చేసింది. తనలోని కొత్త టాలెంట్ ని బయటకు తీసిన వెంకీ.. అదిరిపోయేలా పాడాడు. 

వెంకటేష్ ఆలపించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోని మూడో సాంగ్ అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. గతంలో వెంకటేష్.. గురు మూవీలో సాంగ్ పాడారు. చాలా కాలం తర్వాత వెంకటేష్ మరోసారి సింగర్ అవతారం ఎత్తాడు. సంక్రాంతి కి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. జనవరి 14న విడుదల కానుంది. 

రామానాయుడి తీరని రెండు కోరికలు, గుర్తు చేసుకుంటూ బాలయ్య షోలో వెంకటేష్‌, సురేష్‌బాబు ఎమోషనల్‌

click me!