నిజమైన గాయాలతో విక్కీ కౌశల్.. ఇదిగో 'సర్దార్ ఉద్ధం' ట్రైలర్, హిస్టరీ వింటే గూస్ బంప్స్, ఇందిరా గాంధీ స్వయంగా

By telugu teamFirst Published Oct 1, 2021, 11:42 AM IST
Highlights

స్వాతంత్ర సమరంలో అంతగా ప్రాచుర్యం దక్కని యోధులు ఎందరో ఉన్నారు. స్వాతంత్ర యోధులలో పంజాబ్ లో జన్మించిన ఉద్ధం సింగ్ ఒకరు. ఆయన చరిత్ర తెలిసింది కొద్దిమందికి మాత్రమే. 

దర్శక నిర్మాతలు శ్రద్ధ పెట్టాలేగాని మన స్వాతంత్ర సమరయోధుల కథలని అద్భుతంగా తెరకెక్కించవచ్చు. స్వాతంత్ర సమరంలో అంతగా ప్రాచుర్యం దక్కని యోధులు ఎందరో ఉన్నారు. స్వాతంత్ర యోధులలో పంజాబ్ లో జన్మించిన ఉద్ధం సింగ్ ఒకరు. ఆయన చరిత్ర తెలిసింది కొద్దిమందికి మాత్రమే. 

అలాంటి ఉద్ధం సింగ్ చరిత్రని 'సర్దార్ ఉద్ధం' మూవీ రూపంలో దర్శకుడు సూజిత్ సర్కార్ ప్రజలకు అందించబోతున్నాడు. ఈ చిత్రంలో ఉరి ఫేమ్ విక్కీ కౌశల్ టైటిల్ రోల్ లో నటిస్తుండడం విశేషం. ఉరి తర్వాత విక్కీ నటిస్తున్న మరో ఛాలెంజింగ్ మూవీ ఈ చిత్రం. 

చిన్న తనంలోనే తల్లిదండ్రులని పోగొట్టుకున్న ఉద్ధం సింగ్ అనాథాశ్రమంలో పెరిగారు. తన యుక్త వయసులో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణ కాండ అతడి మనసులో బలంగా నాటుకుపోయింది. భగత్ సింగ్ స్ఫూర్తితో బ్రిటిష్ వారిపై పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు ఉద్ధం సింగ్. 

దీని కోసం తన ఐడెంటిటీని మార్చుకుని మరీ లండన్ వెళ్ళాడు. జలియన్ వాలా బాగ్ మారణకాండకు కారణమైన అప్పటి బ్రిటిష్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్ ని పక్కా స్కెచ్ తో కోక్స్టెన్ హాల్ లో మీటింగ్ కు వచ్చిన మైకేల్ ఓ డయ్యర్ ని 1940 మార్చి 13న షూట్ చేసి చంపేశాడు. డయ్యర్ లంగ్స్, హార్ట్ లోకి బుల్లెట్స్ దిగడంతో స్పాట్ లో డయ్యర్ మరణించాడు. వెంటనే ఉద్ధం సింగ్ బ్రిటిష్ పోలీసులకు లొంగిపోయాడు. 

అదే సంవత్సరం జూలై 31న బ్రిటిష్ ప్రభుత్వం ఉద్ధం సింగ్ కి ఉరిశిక్ష విధించింది. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ బ్రిటన్ నుంచి ఉద్ధం సింగ్ అస్థికలని ఇండియాకు తెప్పించింది. అతడి అస్థికలని సుట్లేజ్ నదిలో కలిపారు. 

ఉద్ధం సింగ్ చరిత్రని కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు సూజిత్ సర్కార్. సర్దార్ ఉద్ధం చిత్రం అక్టోబర్ 16న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ కానుంది. దీనితో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ లో ఉద్ధం సింగ్ గా విక్కీ కౌశల్ నటన అబ్బురపరిచే విధంగా ఉంది. 

బ్రిటిష్ కాలానికి తగ్గట్లుగా విజువల్ బావున్నాయి. ఇక ట్రైలర్ లో విక్కీ కౌశల్ ముఖంపై గాట్లు కనిపిస్తున్నాయి. ఈ గాట్లపై కౌశల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అవి సినిమా కోసం పెట్టుకున్న గాట్లు కావు. నిజంగానే నాకు గాయాలు అయ్యాయి. 2019లో కౌశల్ బూట్ హంటెడ్ షిప్ అనే చిత్రంలో నటించాడు. ఆ చిత్ర షూటింగ్ ముఖంపై డోర్ పడడంతో కౌశల్ కు గాయాలయ్యాయి. ఆ గాట్లు ఇంకా మానలేదని కౌశల్ తెలిపాడు. 

 

click me!