కొండ పొలం మూవీ నుండి రొమాంటిక్ సాంగ్... వైష్ణవ్, రకుల్ కెమిస్ట్రీ పీక్స్!

By team teluguFirst Published Oct 1, 2021, 11:26 AM IST
Highlights

కొండ పొలం(konda polam) చిత్రం నుండి  'శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశ. ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా' అంటూ సాగే రొమాంటిక్‌ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

యంగ్ హీరో వైష్ణవ్ లేటెస్ట్ మూవీ కొండ పొలం విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 8న దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. పూర్తిగా అడవి నేపథ్యంలో నడిచే ఈ చిత్రంలో వైష్ణవ్ కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కొండ పొలం ట్రైలర్, ఆకట్టుకుంది. 

గొర్రల కాపరిగా హీరో, హీరోయిన్స్ పాత్రలు, భీకర అడవిలో ఆధిపత్య పోరు, భయంకరమైన జంతువులు, మనుషుల నుండి ప్రమాదాల సమాహారం కొండ పొలం మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థమైంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండగా, చిత్ర ప్రొమోషన్స్ జోరు పెంచారు.  ఈ చిత్రం నుండి  'శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశ. ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా' అంటూ సాగే రొమాంటిక్‌ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.  


కీరవాణి స్వరాలు సమకూర్చిగా, యామిని ఘంటసాల, పీవీఎస్‌ఎన్‌ రోహిత్‌ ఆలపించారు. ఈ పాటకు సాహిత్యం కూడా కీరవాణి అందించడం విశేషం. సాంగ్ లో వైష్ణవ్‌, రకుల్‌ మధ్య రొమాన్స్ ఓ రేంజ్స్ట్‌ లో ఉంది.  ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.   ఇక టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కొండ పొలం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 
 

click me!